నేడు జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది.
మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.
Advertisement
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మిసిసిప్పిలో దుండగుడి కాల్పుల వల్ల ఆరుగురు చనిపోయారు.
మహిళల టీ20 వరల్డ్‌కప్ లో నేడు ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ కొడుతోంది. గెబెరా వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీ ఫైనల్‌కు టీమిండియా చేరుకోనుంది.
తిరుమలలో 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,633 మంది భక్తులు దర్శించుకున్నారు.
Advertisement
పాకిస్తాన్ కరాచీలో ఉగ్రవాదుల దాడి జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరగడం తో 12 మంది పోలీసులు మృ* చెందారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు సమాచారం. ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో కొత్త ఎమ్మెల్సీల్లో ముగ్గురు, నలుగురికి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
హౌసింగ్ శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సొంతిల్లనేది పేదవాడి కల, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ ల్యాబ్‌లను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించాలని సీఎం వెల్లడించారు.