సీఎం వైఎస్ జగన్ నేడు కడప పర్యటనకు బయల్దేరారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజలో సీఎం పాల్గొననున్నారు.
పంజాబ్ సీఎం మాన్ నేడు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ లను సీఎం సందర్శించనున్నారు.
Advertisement
గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దాంతో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఎయిరిండియా విమానం, రెండు ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతోంది. 398 అంశాలపై పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. రూ.3,500 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలపనుంది.
Advertisement
నేడు సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇటీవల కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లను సీఎం ప్రకటించనున్నారు. కొండగట్టులో మౌళిక సదుపాయాల మాస్టర్ ప్లాన్‌పై ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. 10 కంపార్టుమెంట్ లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.
కడప జిల్లాలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. రూ.8,800 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్నారు.
బీబీనగర్ దగ్గర గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుందగా ఘటన చోటు చేసుకుంది.
మూడు రాజధానులపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల కాన్సెప్ట్ మిస్‌కమ్యూనికేట్ అయ్యిందన్నారు. పరిపాలన మొత్తం విశాఖ నుంచి జరుగుతుందని…. విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.