Home » Feb 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Published: Last Updated on

తమిళనాడులో సినీనటి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని దిండిక్కల్‌లో పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో స‌మంత‌ పూజలు చేసింది.

ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క‌లిశారు. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను ఆయ‌న‌కు కోమ‌టిరెడ్డి వివరించారు.

పార్వతీపురంమన్యం బలిజిపేట మండలం చెల్లింపేటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో రైతు చ‌నిపోయాడు. దాంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

విశాఖలో సైబర్‌ మోసం బ‌య‌ట‌ప‌డింది. సీక్రెట్‌ స్ట్రాటజీ పేరుతో రూ.1.90 కోట్ల మోసం జ‌రిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురు అరెస్ట్ అయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 గా ఉండ‌గా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,230 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.72,000 గా ఉంది.

తిరుమలలో 15 కంపార్టుమెంట్ ల‌లో భక్తులు వేచియున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 71,434 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

నేడు హైదరాబాద్‌కు టి.కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ థాక్రే రానున్నారు. సాయంత్రం 5 గంటలకు సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ సింధు ఇంటికి థాక్రే విచ్చేస్తున్నారు. రేపు డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశం కానున్నారు.

హైదరాబాద్ కొత్త కమిషనరేట్ పరిధిలో 20 కొత్త పోలీస్ స్టేషన్ ల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం జీవో విడుదల చేసింది. దోమల్ గూడ, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్ బండ్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలిచౌకి ప్రాంతాల్లో ఈ పోలీస్ స్టేష‌న్ ల‌ను నిర్మించ‌నున్నారు.

ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలం నిర్వ‌హించారు. కాగా క‌ర్నూలు అమ్మాయి అంజ‌లి శ‌ర్వాణికి జాక్ పాట్ త‌గిలింది. రూ.55 ల‌క్షలకు యూపీ వారియ‌ర్స్ అంజ‌లి శ‌ర్వాణిని కొనుగోలు చేశారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా అమ్మాయి స‌బ్బినేని మేఘ‌న‌ను రూ.30 ల‌క్షల‌కు గుజ‌రాత్ టీమ్ కొనుగోలు చేసింది.

Visitors Are Also Reading