Home » Feb 10th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 10th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

శ్రీహరికోట నుండి నింగిలోకి ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్ ను ప్రయోగించారు. మూడు చిన్నతరహా శాటిలైట్లను ఇస్రో పంపింది. 13 నిమిషాల 2 సెకన్లలో ప్రయోగం పూర్తి కానుంది.

శ్రీహరికోటలో ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతం అయ్యింది. 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

Advertisement

హైదరాబాద్‌ లో నేడు 19 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తూ రైశాఖ నిర్ణయం తీసుకుంది.

modi

నేడు ముంబైలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. రెండు వందే భారత్‌ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

నేటి నుంచి తెలంగాణలో బీజేపీ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌ జరగనున్నాయి. 119 నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Advertisement

తిరుమలలో 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 59,090 మంది భక్తులు దర్శించుకున్నారు.

వైఎస్‌ వివేకా హ* కేసులో నిందితులను కడప నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కడప జైలు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు నిందితులను నాలుగు ప్రత్యేక వాహనాల్లో పోలీసులు తరలించారు.


ఏపిలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం వై ఎస్ ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాల కింద డబ్బును నేడు వారి ఖాతాల్లో జమచేయనుంది.

ఈకేవైసి పూర్తి చేయని వారిని ప్రభుత్వం హెచ్చరించింది. పీఎం కిసాన్ యోజన కింద వారికి డబ్బులు అందవని ప్రకటించింది.

Visitors Are Also Reading