ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన స్టార్ పేసర్ సిరాజ్ అతి తక్కువ సమయంలోనే మేటి బౌలర్‌గా పేరు సంపాదించాడు. టీమిండియా టెస్ట్ జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఆడుతున్న సిరాజ్ తన తొలినాళ్లలో పడిన కష్టాల గురించి చెప్పాడు. తన తండ్రి ఆటో డ్రైవర్‌గా పని చేసేవారని.. రోజుకు రూ.60 ఇవ్వడంతోనే ఉప్పల్ స్టేడియానికి వెళ్లి శిక్షణ పొందేవాడినని చెప్పాడు.
Also Read : నాగార్జున హలో బ్రదర్ సినిమాతో అన్నగారికి సంబంధం ఏంటి….?
Advertisement
అప్పట్లో నేను చాలా కష్టాలు ఎదుర్కున్నాను. మా నాన్న ఒక ఆటో డ్రైవర్. నాకు ప్లాటినా బైకు ఉండేది. పెట్రోల్ ఖర్చులకు అని నాన్న రూ.60తోనే ఉప్పల్ స్టేడియానికి వెళ్లి శిక్షణ తీసుకునే వాడినని.. నేను ఐపీఎల్‌కు ఎంపిక అయిన తరువాత నా కష్టాలన్నీ తీరాయి. నాన్న ఆటో నడపడం ఆపేశారు. మేము కొత్త ఇల్లు తీసుకున్నాం. నాకు ఇంతకన్నా ఏమి అక్కరలేదు. ఐపీఎల్ నాకు పేరు తీసుకొచ్చింది. సమాజంలోని వివిధ వ్యక్తులతో ఎలా మాట్లాలడారో, ఎలా నడుచుకోవాలో నేర్పిందని వెల్లడించాడు.
Advertisement
ఆర్‌సీబీ జట్టును తన ఇంటికి ఆహ్వానించినప్పుడు విరాట్ సర్ ప్రైజ్ ఇచ్చాడని సిరాజ్ చెప్పాడు. నేను ఓసారి ఆర్‌సీబీ జట్టులోని వారందరినీ ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. నేను హోటల్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లిపోయాను. కోహ్లీకి ఫోన్ చేస్తే ఆరోగ్యం బాలేదు రాలేనని చెప్పాడు. కానీ ఆ తరువాత అందరితో పాటు తను కూడా వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నా జీవితంలో అది బెస్ట్ సర్‌ప్రైజ్ అంటూ విరాట్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు సిరాజ్.
Also Read : ఆ వింత పోటీ గురించి ఎప్పుడైనా విన్నారా..?