Home » 2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తే ప్రపంచ కప్ పక్క..!

2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తే ప్రపంచ కప్ పక్క..!

by Azhar
Ad

యూఏఈలో జరిగిన ఐసీసీ 2021 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఎంత ఘోరమమైన పరాజయాన్ని చవి చూసింది అనేది అందరికి తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల పైన ఓడిపోయి సెమీస్ కు కూడా చేరుకోకుండా తిరిగి వచ్చేసింది. ఇక 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ మనం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ కప్పు కూడా గెలవలేదు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ పైన భారత్ కు గట్టి ఆశలే ఉన్నాయి. అందుకు కారణం కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండటం. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022 లో రోహిత్ గాని.. అతని న్యాయకత్వంలోని ముంబై ఇండియన్స్ గాని దారుణంగా విఫలమవుతున్నాయి.

Advertisement

అలాగే రోహిత్ తో పాటుగా కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లు అందరూ ఈ సీజన్ లో విఫలమవుతున్నారు. దాంతో మనం ప్రపంచ కప్ గెలుస్తామా.. లేదా అనే అనుమానం మొదలయింది. అయితే ఈ కప్పు గెలవాలంటే ఒక్కే మార్గం ఉంది అని… 2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తేనే మనం ఈ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే 2007 లో మొదటి టీ20 ప్రపంచ కప్ కు బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లను ఎవరిని పంపించలేదు.

Advertisement

సచిన్ టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ ఇలా అందరూ సీనియర్లకు రెస్ట్ ఇచ్చి… అనుభవం లేని కీపర్ ధోని కెప్టెన్సీలో యువ జట్టును ఆ టోర్నీకి పంపింది. ఇక అంచనాలు లేకుండా టోర్నీ ఆరంభించిన భారత జట్టు ఫైనల్స్ లో పాకిస్థాన్ ను ఓడించి ప్రపంచ కప్పు సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు కూడా అలానే సీనియర్లకు అందరికి రెస్ట్ ఇచ్చి.. కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఐపీఎల్ లో బాగా రాణిస్తున్న యువ జట్టును ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలనీ.. అప్పుడే మనం వాళ్ళు ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి కప్పుతో తిరిగి వస్తారు అని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచన చేస్తుంది అని మాత్రం అనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి :

నేను ఆ ఓవర్ వేయకపోతే రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలిచేది..!

ధోనిపై మరోసారి విరుచుకుపడ్డ హర్భజన్..!

Visitors Are Also Reading