ఫహద్ ఫాజిల్.. ప్రస్తుతమ ఈ పేరే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మలయాళం నటుడు అయిన ఫహద్ ఫాజిల్.. తెలుగు, తమిళ్ సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు. అందుకు కారణం ఆయన నటన. ఫహద్ ఫాజిల్ ఎలాంటి నటుడో అందరికి తెలుసు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే.. ఫహద్ ఫాజిల్ కానీ అయిపోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకు కారణం ఆయన చేస్తున్న పనులే.
Advertisement
అయితే పుష్ప సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్న ఫహద్ ఫాజిల్.. ఈ మధ్య కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో కూడా కనిపించి అభిమానులను అలరించాడు. కానీ ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఫహద్ ఫాజిల్ నటించిన సినిమాలు అన్ని ఓటీటీ వేదికగానే విడుదల అవుతున్నాయి. ఈ కారణంగా ఫహద్ ఫాజిల్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. తన అభిమాన నటుడిని వెండితెర పైన చూడలేకపోతున్నం అనే ఆవేదన అలాగే ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయంలో ఫహద్ ఫాజిల్ పైన ఎగ్జిబిటర్లు కూడా సంతోషంగా లేరు అని తెలుస్తుంది.
Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఓ టాప్ యాక్టర్ గా గుర్తింపు తెచుకున్న ఫహద్ ఫాజిల్ తన సినిమాలను థియేటర్లో విడుదల చేయకపోవడంతో ఎగ్జిబిటర్లు ఆయన పై అసంతృప్తితో ఉంటాలు తెలుస్తుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎగ్జిబిటర్లుకు ఓ రకంగా నష్టం వస్తుంది అని అందరూ ఈ కరోనా సమయంలో అర్ధం చేసుకున్నారు. అందుకే ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఓ నినాయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే.. ఇక మీదట ఎప్పుడు ఫహద్ ఫాజిల్ సినిమా థియేటర్ విడుదలకు సిద్ధం అయిన.. ఆ సినిమాను కొనకూడదు అని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ముందు ముందు ఈ విషయం ఎక్కడికి వెళ్తుంది అనేది.
ఇవి కూడా చదవండి :