విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆయన ఒకరు. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో పలకరించారు. హీరోగా వెంకటేష్ సినీ కెరిర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు ఎక్కువగా చేయకపోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ హీరోగా పరిచయమయ్యాడు.
Advertisement
తొలి సినిమాతోనే వెంకటేష్ సూపర్ హిట్ కొట్టారు. ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో అర్థ శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో 100 రోజులు కూడా ఆడింది. విజయవాడలో కలియుగ పాండవులు శత దినోత్సవ సినీ రంగానికి చెందిన అతిరథ మహారధుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరిపించారు. ఇక ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజాగా వెంకి కుడుముల దర్శకత్వంలో వెంకటేష్ సినిమా కన్ఫామ్ అయ్యింది అంటూ సమాచారం అందుతోంది. సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
Advertisement
అయితే వెంకటేష్ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో లీనమైపోతారనే విషయం తెలిసిందే. ఇక సినిమా కథలో వేలు పెట్టడం, సెట్ లో ఇతరులతో గొడవ పడడం లాంటి విమర్శలు వెంకటేష్ పై ఎప్పుడు రాలేదు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ వెంకటేష్ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే రీమేక్ హీరో అంటూ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు వెంకీ .తమిళంలో, మలయాళంలో, హిందీలో హిట్ అయిన సినిమాల్లోనే ఎక్కువగా నటించేవారని రీమేక్ సినిమాల్లో నటించి ఎక్కువ హిట్లు కొట్టిన రిమేకుల హీరోగా వెంకటేష్ కు ముద్ర పడిపోయింది. ఎక్కువ రీమేక్ సినిమాలో నటించి హిట్ లు కొట్టారన్న ఒక అపవాదు మినహా ఆయన కెరీర్ మొత్తం మీద ఏనాడు విమర్శలు ఎదుర్కోలేదు.