ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉంది అనేది అందరికి తెలుసు. అయితే ఈ ఐపీఎల్ లీగ్ అనేది ప్రపంచంలోనే రెండవ రిచెస్ట్ లీగ్. ఈ మధ్యే దీని రైట్స్ అనేవి 48 వేళా కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక మాములుగా ఐపీఎల్ అంటేనే బేటింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. అప్పుడు పోలీసులు వారిని పట్టుకుంటారు. ఇక ఇప్పుడు గుజరాత్ లో కూడా పోలీసులు ఓ నలుగురిని అరెస్ట్ చేసారు. కానీ వీరు చేసిన పని అనేది తెలిసిన తర్వాత అందరూ షాక్ అవ్వాల్సిందే. వీరు ఐపీఎల్ పైన బెట్టింగ్స్ వేయకుండా.. ఏకంగా ఓ ప్రయివేట్ ఐపీఎల్ నే నడిపిస్తున్నారు.
Advertisement
వీరు కొంతమంది కూలీలను తీసుకొని అలాగే అక్కడ ఉన్న కొంతమంది యువకులను తీసుకొని ఓ నకిలీ ఐపీఎల్ అనేది నిర్వహిస్తున్నారు. వీరు మొదట ఐపీఎల్ లో బాగా పాపులర్ అయిన చెన్నై, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ ఇలా కొన్ని జట్ల జెర్సీను ధరింపజేసి మ్యాచ్ అనేది నిర్వహిస్తారు. ఇక దీనిని క్వాలిటీ కెమెరాలను ఉపయోగించి షాట్ చేస్తూ యూట్యూబ్ లో లైవ్ అనేది నడిపిస్తారు. ఇక ఈ మ్యాచ్ ను ఎంతో మంచి చూస్తున్నట్లు గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయడమే కాకుండా.. వారి సౌండ్స్ ను కూడా ప్లే చేస్తారు. అదే విధంగా ఐపీఎల్ లో ప్రముఖ కామెంటేటర్ అయిన హర్ష భోగ్లేను మిమిక్రి చేస్తూ కామెంట్రీ కూడా ఇస్తారు.
Advertisement
ఇక ఈ సెటప్ అనేది ఇక్కడ నుండి రష్యాకు లింక్ చేసారు. ఎందుకంటే అక్కడ క్రికెట్ ను ఎవరు చూడరు. కాబట్టి వారిని ఎంచుకొని.. అక్కడ పబ్స్ లలో వీరి బుకీని పంపించి అక్కడ బెట్టింగ్స్ వేసేవారికి ఇదే ఐపీఎల్ అంటూ బురిడీ కోటించి… ఇందులో బెట్టింగ్ వేసేలా చేస్తారు. ఇక వచ్చిన బెట్టింగ్స్ ఆధారంగా ఏ జట్టు గెలవాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇలా చేసి ఈ కేటుగాళ్లు లక్షల్లో ఒక్కో వ్యక్తి నుండి వసూల్ చేసేవారు. కానీ తాజాగా వీరి బండారం అనేది బయట పడటంతో వీరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి :