సినిమా వాళ్ల జీవితాలు భయటకు కలర్ ఫుల్ గా కనిపిస్తుంటాయి కానీ వాళ్ల జీవితాల్లో కూడా కష్టసుఖాలు ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి శ్రీలక్ష్మి తన జీవితంలోని విషాదాన్ని బయటపెట్టింది. మేల్ కమెడియన్స్ చాలా మంది ఉంటారు కానీ ఫీమేల్ కమెడియన్స్ తక్కువ మంది ఉంటారు. కాగా శ్రీలక్ష్మీ ఒకప్పుడు లేడీ కమెడియన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.
Advertisement
ఇక తాజాగా శ్రీలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జంద్యాల గారి వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. అంతే కాకుండా తన తండ్రి పేరు అమర్ నాథ్ అని ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రేంజ్ నటుడు అని చెప్పారు. తన తండ్రి దాదాపు వంద సినిమాలలో నటించారని అయితే ఆ తరవాత ఆయన హవా తగ్గిందని అన్నారు.
Advertisement
అయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించమంటే నో చెప్పేవారని ఆ తరవాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. దాంతో పూట గడవటం కూడా కష్టం అయిందని చెప్పారు. తాను సినిమాలలో నటించాలనేది తన తల్లి నిర్నయం అని ఫీల్డ్ గురించి తెలియడం వల్ల తన తండ్రికి ఇష్టం ఉండేదని కాదని అన్నారు. తన తల్లి సినిమాలలో నటించాలని చెప్పిందని అంతే కాకుండా నువ్వు సినిమాలలో నటిస్తే తలా ఇంత అన్నం తిందాం లేదంటే తలా ఇంత విషం తీసుకుందామని చెప్పిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ :అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్న సెలబ్రెటీలు వీళ్లే..!