Home » దుబాయ్ శ్రీనులో ఎంఎస్ పాత్ర కోసం శ్రీనువైట్ల ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశాడా..?

దుబాయ్ శ్రీనులో ఎంఎస్ పాత్ర కోసం శ్రీనువైట్ల ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశాడా..?

by AJAY
Ad

శ్రీనువైట్ల ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌కు కాస్త దూర‌మయ్యాడు కానీ కొన్నేళ్ల క్రితం మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ లు ఇచ్చాడు. మ‌హేశ్ బాబుతో దూకుడు లాంటి సినిమా చేసి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక శ్రీను వైట్ల సినిమా అంటే దేనికీ లోటు ఉండ‌దు. ముఖ్యంగా ఎంట‌ర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుంది. కామెడీతో ప్రేక్ష‌కుల‌కు కిత‌కిత‌లు పెట్టే టాలెంట్ శ్రీనువైట్ల‌కు చాలానే ఉంటుంది.

ALSO READ :భారతీయులు ఇప్పటికీ ఇష్టపడే 5 అద్భుత బైక్స్.. ఏవో తెలుసా ..?

Advertisement

అయితే కొన్నిసార్లు శ్రీనువైట్ల చేసే కామెడీ వ‌ల్ల విమ‌ర్శలు కూడా ఎదురుకున్నాడు. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేసి శ్రీనువైట్ల కామెడీని పండిస్తాడ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ర‌వితేజ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దుబాయ్ శ్రీను సినిమా మంచివిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే ఈ సినిమాలో ఎంఎస్ నారాయ‌ణ ముస‌లి హీరో పాత్ర‌లో క‌నిపించాడు. విగ్గు పెట్టుకుని స్టైల్ గా డైలాగులు చెప్ప‌లేక ఫైట్ లు చేయ‌లేక అవస్థ‌లు ప‌డుతూ ఉంటాడు. ఫైవ్ స్టార్ స‌ల్మాన్ రాజు అనే పేరుతో ఎంఎస్ కామెడీ పండించాడు. అయితే ఈ పాత్ర ఓ స్టార్ హీరోను ఉద్దేశించి చేసిందే అనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అంతే కాకుండా ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ట‌. శ్రీనువైట్ల గ‌తంలో ఓ స్టార్ డైరెక్ట‌ర్ వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో ఆ డైరెక్ట‌ర్ ఓ సీనియ‌ర్ స్టార్ హీరోతో సినిమా చేశారు. ఇక ఆ హీరో షూటింగ్ లో డ్యాన్స్ చేయ‌మంటే గోడ‌పై పిడ‌క‌లు వేసే స్టెప్పులే వేశాడట‌. ఇక ఆ పాత్ర‌ను ఇన్స్పైర్ గా చేసుకుని శ్రీనువైట్ల ఫైవ్ స్టార్ స‌ల్మాన్ రాజు అనే పాత్ర‌ను దుబాయ్ శ్రీను లో పెట్టారు.

ALSO READ :‘దసరా’ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

Visitors Are Also Reading