Home » భారతీయులు ఇప్పటికీ ఇష్టపడే 5 అద్భుత బైక్స్.. ఏవో తెలుసా ..?

భారతీయులు ఇప్పటికీ ఇష్టపడే 5 అద్భుత బైక్స్.. ఏవో తెలుసా ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా మనిషికి ఎంత పెద్ద కారు ఉన్నా ఫ్లైట్ ఉన్నా బైక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.రోజుకు ఒక్కసారైనా బైక్ రైడ్ చేస్తూ ఉంటారు. ఇక సాధారణ మధ్యతరగతి ప్రజలకైతే బైక్ ఏ కారు , విమానం. ఎటు వెళ్లిన ఈ బైక్ పైనే ప్రయాణం చేస్తుంటారు. అయితే బైక్ అంటే అందులో పలు రకాల కంపెనీలు ఉన్నాయి. ఎవరి టేస్ట్ కు తగ్గట్టు వారు వారి డ్రీమ్ బైకును కొనుక్కుంటూ ఉంటారు.. మన ఇండియాలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిన ఐదు బైకు కంపెనీలు ఇప్పుడు చూద్దాం..
కెనటిక్ హోండా:

ప్రస్తుతం ఈ స్కూటర్ ల ఉత్పత్తి తగ్గిపోయినప్పటికీ , ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి.. కెన్ ఐ టెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ హోండా మోటార్ కంపెనీ కలిసి 1984 నుండి 98 వరకు ఈ బైక్స్ ఉత్పత్తి అయ్యాయి. ఆ తర్వాత ఆగిపోయాయి. ఇది కొత్తగా వచ్చిన తరుణంలో ఈ బైక్ అంటే చాలా మందికి డ్రీమ్ బైక్ గా ఉండేది.
బజాజ్ చెతక్ :

Advertisement

మీ తాత లేదంటే మీ నాన్న మిమ్మల్ని ఒక్కసారైనా ఈ బైక్ మధ్యలో నిలబెట్టుకొని రైడ్ చేసి ఉంటారు.. మీరు మధ్యలో నిలబడి హ్యాండిల్ పట్టుకొని ముందుకు చూస్తున్న ఫీలింగ్ ను ఒకసారి గుర్తు చేసుకోండి. 1972 నుంచి 2006 వరకు బజాజ్ సంస్థ చెతక్ ఉత్పత్తిని కొనసాగించింది . మిలియన్ల కొద్ది భారతీయులు దీన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికి చెతక్ అంటే చాలామందికి డ్రీం బైక్ గా ఉంటుంది. చాలామంది ఇప్పటికీ తిని నడుపుతూ కనిపిస్తారు.

also read:IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

Advertisement

యమహా ఆర్ఎక్స్ 100 :

ఈ బైక్ ని ఇష్టపడని వారు ఉండరు.. ఈ బైక్ పేరు మీద సినిమా కూడా వచ్చింది. యూత్ ను ఎంతగానో కనెక్ట్ చేస్తుంది ఈ బైక్. 1985 నుంచి 96 మధ్యలో ఈ బైక్స్ ఉత్పత్తి జరిగింది. యువతలో ఎక్కువగా క్రేజ్ ఉండే ఈ బైక్ , మళ్లీ ఇప్పుడు మార్కెట్లోకి రావాలని ఎంతోమంది భారతీయులు కోరుకుంటున్నారు.
సుజుకి సామ్రాయి:

1990 లలో యూత్ ని ఎక్కువగా ఆకట్టుకున్న బైక్ సుజుకి సామ్రాయి. స్పోర్టివ్ డిజైన్తో వచ్చిన ఈ బైక్ అప్పట్లో చాలా సేలింగ్ అయింది. ఇది మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎక్కడో ఒకచోట ఈ బైక్ కనిపిస్తోంది.

also read:‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!

బుల్లెట్:

ఇక అన్ని బైకుల్లోకెల్లా బుల్లెట్ బైక్ చాలా డిఫరెంట్. యూత్ ఈ బైక్ అంటే పడి చస్తారనుకోండి. దీనిపై కూర్చుంటే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. 2007లో సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్కసారిగా టు వీలర్ మార్కెట్ ను షేక్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇవి క్లాసిక్ 350 పేరుతో టాప్ సెల్లింగ్ లో ఉన్నాయి. ఇవే కాకుండా రాజ్ దూత్, హెచ్డి, వెస్పా వంటి బైకులు భారతీయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

also read:సచిన్ 10th ఫెయిల్.. ధోని12th పాస్..9th మాత్రమే చదివిన స్టార్ క్రికెటర్..ఎవరంటే.?

Visitors Are Also Reading