Home » బాలయ్య భైరవ ద్వీపం సినిమాకు సెన్సార్ వాళ్ళు ఎందుకు అభ్యంతరం తెలిపారు…? తెర వెనక అంత జరిగిందా ..?

బాలయ్య భైరవ ద్వీపం సినిమాకు సెన్సార్ వాళ్ళు ఎందుకు అభ్యంతరం తెలిపారు…? తెర వెనక అంత జరిగిందా ..?

by AJAY
Ad

బాలకృష్ణకు నటసింహం అని పేరు ఊరికే రాలేదు. ఎన్టీఆర్ తనయుడు గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు. పౌరాణిక, జానపద, చిత్రాలతో పాటు మాస్ ఓరియంటెడ్ కథలలో నటించారు. బాలయ్య తన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇటీవల బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

Also Read:  JR. NTR పేరును రాజీవ్ కనకాల మొబైల్ లో మరీ ఇలా SAVE చేసుకోవడమేంట్రా బాబు..!!

Advertisement

ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా పై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా బాలయ్య హోస్ట్ గా కూడా ఆహా లో అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించిన సినిమా మాత్రం భైరవద్వీపం. ఈ సినిమాను ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు.

Advertisement

ఈ సినిమాతో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. 1994లో విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలోనూ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి 9 నంది అవార్డులు వచ్చాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా రోజా నటించగా…. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం ఆసక్తికరమైన విషయం జరిగింది. ఈ సినిమా సెన్సార్ సమయంలో సెన్సార్ సభ్యులు ఓ విషయం లో చిత్ర యూనిట్ కు వార్నింగ్ ఇచ్చారు. భైరవద్వీపం సినిమాలో గుర్రాలు ఉంటాయి అన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో బాణాలు తగిలి గుర్రాలు కింద పడిపోయే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఆ సీన్ల విషయంలో సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారట. గుర్రాలకు బాణాలు తగిలి కిందపడిపోతున్న సన్నివేశాలపై అటవీ శాఖ వాళ్ళు కానీ బ్లూ క్రాస్ వాళ్ళు కానీ అభ్యంతరం తెలిపితే ఆ సీన్లను తొలగించాలని చెప్పారట. అయితే సినిమా విడుదల తర్వాత ఫారెస్ట్ వాళ్ళు కానీ బ్లూ క్రాస్ వాళ్ళు కానీ అభ్యంతరం తెలపకపోవడంతో ఆ సన్నివేశాలను తొలగించలేదు.

Also Read: బాలకృష్ణ స్పెషల్ బిర్యాని 2 రూపాయలకే.. ఎక్కడంటే..?

Visitors Are Also Reading