Home » F3 MOVIE REVIEW : ఎఫ్ -3 సినిమా రివ్యూ & రేటింగ్…!

F3 MOVIE REVIEW : ఎఫ్ -3 సినిమా రివ్యూ & రేటింగ్…!

by AJAY

సినిమా – ఎఫ్- 3

డైరెక్టర్ – అనిల్ రావిపూడి

ప్రొడ్యూసర్ – దిల్ రాజు

నటీనటులు – వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, సునీల్, ఆలీ, అన్నపూర్ణ, మురళీశర్మ, రఘుబాబు, ప్రగతి మరికొందరు.

మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-2 సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్-3 చిత్రాన్ని తెరకెక్కించారు. ఎఫ్-2 లో భార్య‌ల‌ వల్ల వచ్చే ఫ్ర‌స్టేషన్ ను చూపిస్తే ఎఫ్-3 సినిమాను డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ఆధారంగా సినిమాని తెరకెక్కించారు. అలా ఎన్నో అంచనాల మధ్య ఎఫ్-3 సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుదలైంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం..

F3 Movie Review and Rating

F3 Movie Story క‌థ‌ :

సినిమా కథ విషయానికి వ‌స్తే ఎఫ్ -2 సినిమాలో భార్య‌ల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించినట్టుగానే ఎఫ్-3 లో డబ్బు వల్ల వచ్చే ఫ్ర‌స్టేష‌న్ ను చూపించారు. డబ్బు అనే కోణంలోనే ఈ సినిమా కథ మొదలవుతుంది. ఈ సినిమాలో వెంకటేష్ వెంకీ, వరుణ్ వరుణ్ యాద‌వ్ అనే పాత్ర‌ల్లో న‌టించారు. వీరి భార్యలకు డబ్బు బంగారం పిచ్చి ఉంటుంది. వెంకీకి వ‌డ్డీ వ్యాపారం చేస్తుండ‌గా అతడికి డ‌బ్బు ఆశ‌…వ‌రుణ్ తేజ్ కు థ‌న‌వంతుడు అవ్వాల‌నే కోరిక‌లు ఉంటాయి. ఈ క్రమంలో వాళ్లు పడే కష్టాలను చూపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో వెంకికి రేచీకటి ఉండ‌గా…వ‌రుణ్ తేజ్ కు న‌త్తి ఉంటుంది. అలా ఇద్దరు లోపాలను కలిగి ఉండి డబ్బు సంపాదించేందుకు నానా కష్టాలు పడతారు. డబ్బు సంపాదించేందుకు వెంకీ, వ‌రుణ్ ఏం చేశారు. అదేవిధంగా భార్యల‌ వల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన సునీల్ పాత్ర ఏంటి..? చివరకు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథతో ఎలాంటి మెసేజ్ ఇచ్చారనేదే ఈ సినిమా కథ.

విశ్లేష‌ణ :

ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించగా వెంకటేష్ సినిమా ను త‌న భుజాలపై మోసాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వెంకటేష్ చుట్టే తిరుగుతుంది. సునీల్ కూడా మళ్లీ తన కామెడీ టైమింగ్ తో నవ్వించగ‌లిగాడు. అదేవిధంగా సెకండాఫ్ లో వెంకీ, వరుణ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సూపర్ గా అనిపిస్తాయి. ఈ సినిమా కథ ఇదే అని ఖచ్చితంగా చెప్పలేం…. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఫుల్ టూ ఎంటర్ టైన్ మెంట్ గా అనిపిస్తుంది. ఈ చిత్రంలో మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆయన డబ్బు వల్ల వచ్చే ప్రస్టేషన్ ను ముందే వివరిస్తారు మంచి మెసేజ్ ఇస్తారు. సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. పూజా తన ప‌ర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మెహరిన్, తమన్నా ల పర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. అయితే ఎఫ్- 3 లో ఎక్కువ మంది నటీనటులు ఉండటం వల్ల ఎఫ్- 2 కంటే హీరోయిన్ ల‌కు ప్రాధాన్యత తగ్గింది. మొత్తంగా చూసుకుంటే ఎఫ్-3 సినిమాను ఫ్యామిలీతో క‌లిసి స‌రదాగా చూసెయ్యెచ్చు.

సినిమాలో ప్లస్ లు, మైనస్ లు :

ఈ సినిమాకు వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, ఆలీ కామెడీ టైమింగ్ లు ప్లస్ గా నిలిచాయి. బ్యాక్ టూ బ్యాక్ వచ్చే కామెడీ ఎక్కడా బోర్ కొట్టకుండా చేస్తుంది. సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి.

సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా ఉండ‌టం మైనస్ అయ్యింది. అదేవిధంగా సినిమాకు సరైన కథ అంటూ లేదు. ఒకటి రెండు పాటలు మినహా మిగ‌తా పాటలు మమ అనిపించారు.

also read: ‘బద్రి’ స్టోరీని డైరెక్టర్ పూరి అంత చీప్ రేట్ కి అమ్మేయాలని అనుకున్నారా..? నాగ్ నుంచి పవన్ కి ఆ సినిమా ఎలా వెళ్లిందంటే…!

Visitors Are Also Reading