ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు పేరుపొందిన అతి కొద్ది మంది నేతల్లో తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఒకరు. ముఖ్యంగా కేంద్ర, రాష్టాల్లో అధికార పార్టీలపై ఆయన ఈ మధ్య తరచుగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సైతం చింతా మోహన్ తూర్పారపట్టారు.
Advertisement
Advertisement
తాజాగా 2024 ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాపు వ్యక్తే అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కేవలం ఆ రెండు సామాజిక వర్గాల సొంతం కాదని పేర్కొన్నారు. ఏపీ ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన వెల్లడించారు మరోవైపు ఏపీ విభజనకు సంబంధించి చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేసారు. 1990 డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారని, అది ఎవ్వరికీ తెలియదని పేర్కొనడం గమనార్హం. విభజన తరువాత కాంగ్రెస్ పై అపవాదు వేశారు. కానీ విభజనకు కారకులైన వారు హీరోల్లాగా తిరుగుతున్నారని ఆక్షేపించారు. దేశంలో, రాష్ట్రంలో పేదల పార్టీ అయిన కాంగ్రెస్ ఎప్పుడూ శ్రీరామరక్షగా ఉంటుందని మాజీ ఎంపీ చింతా మోహన్ పేర్కొన్నారు.