సాధారణంతో యువతీ, యువకులు ప్రేమించుకోవడం మనం నిత్యం చూస్తేను ఉంటాం. కొందరూ ఒకే ఒక వ్యక్తితో పీలకల్లోతు ప్రేమలో మునిగితేలి తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తుంటే.. మరికొందరూ మాత్రం యూజ్ అండ్ త్రో మాదిరిగా అవలంబిస్తుంటారు. ముఖ్యంగా ఈరోజుల్లో అయితే ఒకిరికీ తెలియకుండా మరొకరినీ.. లేదా ఒకరి తరువాత మరికొరు అంటూ ప్రేమ, పెళ్లి పేరుతో తరచూ మోసం చేస్తుంటారు. మోసపోతూనే ఉన్నారు. అలా మోసపోయిన వారు తమ ప్రియుడు లేదా ప్రియురాలు వేరే వారిని పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిగే ప్రదేశానికి వెళ్లి గొడవ పడటం కూడా మనం చూస్తుంటాం.
Advertisement
కొన్ని సందర్భాల్లో జరుగుతున్న పెళ్లిళ్లు కూడా ఆగిపోయినవి చాలానే ఉన్నాయి. తాజాగా ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురు అయింది. గతంలో తమను ప్రేమ పేరుతో మోసగించాడు అని యువకుడు పెళ్లి చేసుకోనే పెళ్లి మండపం వద్దకు వెళ్లి మాజీ ప్రియురాలు ఆందోళన చేపట్టారు. “తమను కాదని పెళ్లి చేసుకుంటున్నావు. నిన్ను వదిలి పెట్టమని.. నీ జీవితాన్ని నాశనం చేస్తాం” అని శపథం చేస్తున్నారు. చైనాలోని యున్నన్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Also Read : మరోసారి జీహెచ్ఎంసీ మేయర్ ను టార్గెట్ చేసిన వర్మ…అప్పుడేమో అలా ఇప్పుడు ఇలా..!
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. చెన్ అనే యువకుడి ఫిబ్రవరి 06న పెళ్లి జరిగింది. ఇక ఆ సమయంలో పెళ్లి మండపం వద్ద అతని మాజీ ప్రియురాళ్లు ప్రత్యక్షమయ్యారు. “ మేము మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేము అంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం” అని రాసి ఉన్న బ్యానర్ ని పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చినటువంటి అతిథులందరూ బ్యానర్ చూసి ఏం జరిగిందని ఆసక్తిగా ఆరా తీయగా.. అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామానికి బెంబేలెత్తిన వధువు పేరెంట్స్ ఏం జరిగిందని వరుడు చెన్ ని నిలదీశారు. చెన్ స్పందిస్తూ.. నిజాయితీగా వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. గతంలో వారితో తిరిగిన మాట వాస్తవమే.. అంతేకాదు.. ఓ చెడు వ్యక్తిగా వారితో ప్రవర్తించాను అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో మానసిక పరిపక్వత లేకపోవడంతో చాలా మంది అమ్మాయిలను బాధపెట్టినట్టు తెలిపాడు. దీంతో నూతన వధువు తనతో గొడవ పెట్టుకుందని వాపోయాడు. “అమ్మాయిలను మోసం చేయకూడదు. వారిని నిజాయితీగా ప్రేమించాలి. లేదంటే ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే.. భవిష్యత్ లో మీరు బలవుతారు” అంటూ క్షమాపణలు చెప్పాడు. ఇంత జరిగినా వారితో విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించకుండా చెన్ తప్పించుకోవడం విశేషం.