మన భారతదేశం అంటేనే అనేక మూడాచారాలకు పుట్టినిల్లు. ఈ ఆచారాలు మన పూర్వ కాలం నుంచి పాటిస్తూ ఉన్నాం. ఇందులో భార్యభర్తల మధ్య పాటించాల్సిన ఆచారాలు మరియు కొన్ని నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.వివాహం జరిగిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రానికి పిన్నిసులు, హెయిర్ పిన్నులు లాంటివి అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే మంగళసూత్రం అనేది వేదమంత్రాలతో ప్రభావితం అయిన, భర్త యొక్క ఆయువుపట్టు. మంగళసూత్రం అనేది స్త్రీల యొక్క హృదయం వద్ద ఉంటుంది. కాబట్టి పిన్నీసులు, ఇనుప వస్తువులు దివ్యశక్తులను ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. దీనివల్ల మంగళసూత్రానికి ఉండే దివ్యశక్తులను ఆకర్షించి మీ భర్తను శక్తిహీనంగా చేస్తాయి. దీనివల్ల భర్తకు అనారోగ్యం కలుగుతుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గుతాయి. కాబట్టి ఈ అలవాటును మానుకోవాలి.
Advertisement
2. స్త్రీలు మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని ఇవ్వడమే కాకుండా, వీటిశబ్దాలు ప్రేమనురాగాలను కలిగిస్తుంది.
Advertisement
3. అలాగే ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
4. అలాగే ఇంట్లో ఆడపడుచులు అత్తమామలతో విభేదాలు కలిగినట్లయితే వారితో ఇబ్బందులు ఎదురైతే వారు పడుకునే దిండు కింద తులసి వేర్లను ఉంచితే వారికి మీ పై ప్రేమను గుణాలు కలుగుతాయి.
5. అలాగే మీ భర్త ఎక్కువగా తాగుడుకు బానిస అయినట్లయితే ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటిలో కలిపి వారితో తాగించాలి. ఈ విధంగా రెండు నెలలపాటు చేస్తే వారికి మద్యం అంటే విరక్తి కలుగుతుంది. ఈ కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది.
- ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చిన ఓమ్ రౌత్…!
- తన సినిమాలో ఆ సీన్స్ తప్పనిసరి ఉండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!