సాధారణంగా చాలా మంది చింతపండు తినేందుకు ఇష్టపడుతుంటారు. చింతపండుతో సాంబారు, రసం వంటివి చేస్తే ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు ఒక ముద్ద అన్నం ఎక్కువగా తినవచ్చని అభిప్రాయపడుతుంటారు. కానీ చింతపండును అందరూ తినకూడదని చాాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొంత మందికి చింతపండు చాలా ప్రమాదకరం. ప్రధానంగా దంత సమస్యలున్న వారు చింతపండు అస్సలు తినకూడదట. చింతపండు తినడం వల్ల దంత సమస్యలు అధికమయ్యే అవకాశముంది. అందుకే జాగ్రత్త పడడం ఉత్తమం.
Advertisement
అదేవిధంగా ఎలర్జీ సమస్య ఉన్న వారు కూడా చింతపండును ఎక్కువ తీసుకోవడంతో ఎలర్జీ ఎక్కువయ్యే అవకాశముంది. ఎలాంటి పరిస్థితిలోనైనా రింగ్ వార్మ్, దురద, వాపు,మైకం వంటి సమస్యల వల్ల ప్రమాదం పెరుగుతుంది. చింతపండు ఎక్కువగా తీసుకుంటే.. దాని నుంచి వినియోగాన్ని తగ్గించుకోవడం ఉత్తమం.
Advertisement
Also Read : పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరి కాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
ప్రధానంగా పచ్చి చింతపండును అస్సలు తీసుకోకూడదు. జీర్ణ సమస్యలున్న వారు చింతపండుకు తినకపోవడం బెటర్. జీర్ణసమస్యలున్న వారు చింతపండు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం అధికమవుతుంది. ఉదర సంబంధిత సమస్యలున్న వారు చింతపండు జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. వీరితో పాటు గ్యాస్ సమస్య ఉన్న వారు కూడా చింతపండుకు దూరంగా ఉండడం బెటర్.