ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కలెక్షన్ ల సునామీ వచ్చింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది. అన్ని విభాగాలలోనూ రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఒక్క విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి క్రియేట్ చేసినా రికార్డును బ్రేక్ చేయలేకోపోయింది. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ALSO READ : ఫ్లాప్ టాక్ తో 100రోజులు ఆడిన ప్రభాస్ 4 సినిమాలు ఏవో తెలుసా..!
Advertisement
మెగాస్టార్ హీరోగా నటించిన ఇంద్ర సినిమా 2002లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యింది. అయితే ఈ సినిమా క్రియేట్ చేసిన ఓ రికార్డును అన్ని రికార్డులను బద్దలు కొట్టిన బాహుబలి కూడా బీట్ చేయలేకపోయింది. ఇంద్ర సినిమాకు మెగాస్టార్ హోమ్ టౌన్ తునిలో 17లక్షల బిజినెస్ జరిగింది. అయితే బాహుబలికి మాత్రం ఇక్కడ 14 లక్షల బిజినెస్ మాత్రమే జరిగింది. బాహుబలి సినిమా 2015లో విడుదలైంది.
Advertisement
అంతే ఇంద్ర సినిమా వచ్చిన పదమూడేళ్లకు బాహుబలి వచ్చింది కానీ మెగాస్టార్ ఇంద్ర కలెక్షన్ లను బీట్ చేయలేకపోయింది. అంతే కాకుండా అప్పటికి ఇప్పటికి టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి అయినప్పటికీ బాహుబలి ఇంద్రను బీట్ చేయలేకపోయింది. అంటే తునిలో మెగాస్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ మెగాస్టార్ అభిమానులు కాలర్ ఎగరేసుకుని ఇంద్ర కలెక్షన్ లు తునిలో సాధించిన రికార్డును గురించి చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి విజయాలతో మెగాస్టార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇదిలా ఉండగానే మరికొందరు టాలెంటెడ్ దర్శకులతో మెగాస్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.