Home » Energy Foods: మనకు శక్తినిచ్చే ఆహారాలు ఇవేనా..?

Energy Foods: మనకు శక్తినిచ్చే ఆహారాలు ఇవేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అరటి పండులో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ బి6, పొటాషియంతో పాటు పోషకాలు ఉంటాయి. దీనివల్ల శక్తి పెరుగుతుంది. ఇవి తినడం వల్ల శక్తి పెరిగి కండరాల పనితీరు బాగుంటుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఎలాంటి ఆహారాలు తింటే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం..?

పెరుగు:పెరుగులో మంచి ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఎక్కువ సమయం శక్తి ఉండేలా దోహదపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా లాభం కలుగుతుంది. పెరుగులో పండ్లు వేసుకుని తినడం వల్ల శక్తి పెరుగుతుంది.

Advertisement

అరటి పండు: అరటి పండులో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ఫైబర్, విటమిన్ బి6, పొటాషియం మెండుగా ఉంటాయి. దీంతో ఒంట్లో శక్తి పెరుగుతుంది.

చియా విత్తనాలు:ఈ విత్తనాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శక్తి పెరుగుతుంది. రోజంతా శక్తిగా ఉండేందుకు చియా విత్తనాలు తినడం మంచిది. వీటిలో కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లతోపాటు తక్కువ కార్బోహైడ్రేడ్లు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల ప్రొటీన్లు ఉండటంతో రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది.

Advertisement

ఖర్జూరాలు:మనకు మంచి శక్తిని ఇచ్చేవిగా ఉంటాయి. అందుకే రంజాన్ సమయంలో ముస్లింలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నిషియం, జింక్, ఇనుము లభించడంతో వీటిని తినడం వల్ల మనకు శక్తి ఇమడనిస్తుంది. అందుకే వీటిని తినేందుకు మనం చొరవ తీసుకుంటే మంచిదే

ఓట్స్:ఇవి కూడా మంచి ఆహారమే. షుగర్ పేషెంట్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

also read:

Visitors Are Also Reading