Home » ఫ్లాప్ టాక్ వచ్చిన నిజం ఎన్ని కోట్లు వసూలు చేయిందో తెలుసా..?

ఫ్లాప్ టాక్ వచ్చిన నిజం ఎన్ని కోట్లు వసూలు చేయిందో తెలుసా..?

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం మహేష్ బాబు టాప్ హీరోల లిస్టులో ఉన్నాడు. కేవలం ఒకే రకమైన సినిమాలకు అతుక్కుపోకుండా మహేష్ బాబు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Advertisement

అయితే మహేష్ బాబు చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసి కొట్టాయి కూడా. దాంతో కొన్ని ఫ్లాపులు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలా మహేష్ బాబు ఖాతాలోని ఫ్లాప్ సినిమాలలో నిజం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Advertisement

ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రక్షిత నటించింది. అంతే కాకుండా గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. జయం, చిత్రం, నువ్వు నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత నిజం సినిమా తీయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రూ.10 కోట్ల పైగా షేర్ ను రాబట్టినట్టు తేజ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. నిజం తన గత సినిమాల మాదిరిగానే 10 కోట్ల వసూళ్లు రాబట్టిందని చెప్పాడు. కానీ అందరు నిజం సినిమాను ఫ్లాప్ సినిమా అని చెప్పుకుంటారు. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అయిందని అన్నారు. ఒక్కడు సినిమా తర్వాత నిజం సినిమా రావడం వల్ల ఫ్లాప్ టాక్ వచ్చింది అని చెప్పాడు.

Visitors Are Also Reading