Home » అంతరించిపోనున్న పురుషులు.. ఆ పరిశోధన ఏం చెబుతుందంటే..!!

అంతరించిపోనున్న పురుషులు.. ఆ పరిశోధన ఏం చెబుతుందంటే..!!

by Sravanthi
Ad

మానవ వృద్ధి జరగాలంటే స్త్రీ పురుషులు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే జనాభా పెరుగుతుంది.. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ప్రపంచంలో అనేక ఇబ్బందుల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే ఒక పరిశోధన సంస్థ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.. భవిష్యత్తులో భూమిపై మహిళలు మాత్రమే ఉంటారని మగవారి జనాభా అంతరించిపోతుందని ఈ పరిశోధనలో వారు వెల్లడించారు.. మరి దానికి కారణాలు ఏంటో చూద్దాం.. జపాన్ దేశంలోని ఒక దివిలో అంతరించిపోతున్నటువంటి మగ ఎలుకలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

Advertisement

also read:ఎన్టీఆర్ కు 18 లక్షలు.. కృష్ణంరాజుకు 25 లక్షలు.. బొబ్బిలి బ్రహ్మన్న ఫ్లాష్ బ్యాక్..!!

సాధారణంగా ఎలుకలు అనేవి అంతరించిపోయే పరిస్థితి అసలు రాదు. అవి చాలా ఫాస్ట్ గా వాటి సంఖ్యను పెంచుకోగలవు.. అలాంటి ఎలుకల్లో ఏమైందో ఏమో సంఖ్య తగ్గుతూ వచ్చింది.. మొగ ఎలుకలు తగ్గాయి, ఆడ ఎలుకలు పెరిగాయి.. దీంతో అనుమానం వచ్చిన శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఎలుకల్లో Y క్రోమోజోమ్ లేదని తేలింది. దీన్ని బట్టి ఇదే పరిస్థితి మనుషుల్లో కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆలోచన. సాధారణంగా మహిళల్లో xx క్రోమోజోములు ఉంటాయి. మగాళ్లలో XY క్రోమోజోములు ఉంటాయి.. ఇందులో మగవారి X క్రోమోజోమ్, ఆడవారి X క్రమజంతో కలిస్తే ఆడపిల్ల, అంతేకాకుండా మగవారి Y, ఆడవారిX క్రోమోజోములు కలిస్తే మగవారు పుడతారు..

Advertisement

ఈ విధంగా చూసుకుంటే మగవారిలో Y క్రోమోజం ఉండదని అందువల్ల మగ పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుందని, మగజాతి అంతరిస్తుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.. ఈ విధంగా y క్రోమోజం తగ్గిపోవడంతో .. ఆడ ఎలుకల్లో స్వయం పునరుత్పత్తి కనిపిస్తోంది. అందువలన మగ ఎలుకలతో పని లేకుండా ఆడే ఎలుకలు సొంతంగా వాటీ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒక ప్రత్యేకమైన జన్యువు అని అంటున్నారు. ఈ విషయం అంత PNAS జర్నల్లో ఓ పేపర్ లో పబ్లిష్ చేశారు.

also read:

Visitors Are Also Reading