Home » ఎన్టీఆర్ కు 18 లక్షలు.. కృష్ణంరాజుకు 25 లక్షలు.. బొబ్బిలి బ్రహ్మన్న ఫ్లాష్ బ్యాక్..!!

ఎన్టీఆర్ కు 18 లక్షలు.. కృష్ణంరాజుకు 25 లక్షలు.. బొబ్బిలి బ్రహ్మన్న ఫ్లాష్ బ్యాక్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అది 1983 టైం అప్పటికే కృష్ణంరాజు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కే రాఘవేంద్రరావు కృష్ణంరాజు కాంబినేషన్ అప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఈ తరుణంలోనే అడవి సింహాలు సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ తరుణంలోనే రాఘవేంద్రరావు పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లి ఒక ఊరి పెద్ద తీర్పులు చెబుతుంటాడు. ఆరడుగుల అందగాడు, గంభీరంగా ఉంటాడు.

Advertisement

also read:శోభన్ బాబు, చంద్రమోహన్ దగ్గర తీసుకున్న 2 లక్షలతో 30 ఎకరాలు కొన్నారని మీకు తెలుసా..?

ఈ క్యారెక్టర్ ను బేస్ చేసుకుని కథ రాయండి అని చెప్పారు రాఘవేంద్రరావు. దీంతో బ్రదర్స్ ఇద్దరు మహాభారతంలోని ఒక అంశాన్ని తీసుకొని కథను రెడీ చేస్తారు. కథ రాఘవేంద్రరావుకి చాలా నచ్చింది. కథ కృష్ణంరాజు కూడా వినిపించారు ఆయన కూడా ఓకే చేసేసారు. ఈ సినిమాలో శారద, జయసుధ హీరోయిన్స్. సినిమా పేరు బొబ్బిలి బ్రహ్మన్న. కృష్ణంరాజు బ్రహ్మన్న పాత్రలో చాలా గంభీరంగా కనిపించేవారట. షూటింగ్ పూర్తి చేసుకొని 1984 మే 25న సినిమా రిలీజ్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో కృష్ణంరాజును ఎన్టీఆర్ స్థాయికి తీసుకెళ్లాయి అలనాటి పత్రికలు.

Advertisement

నిజానికి ఆ సినిమాతో ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేశాడని కూడా రాశాయి. దీనికి తగ్గట్టుగానే తర్వాత సినిమా భారతంలో శంఖారావం 25 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు కృష్ణంరాజు. అప్పట్లో ఇది గొప్ప రెమ్యూనరేషన్.. ఇదే సమయంలో నాదేశం సినిమాకి ఎన్టీఆర్ 18 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్ హైయెస్ట్.. దాన్ని బ్రేక్ చేశారు కృష్ణంరాజు. ఈ విధంగా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ బ్రేక్ చేసిన హీరోగా కృష్ణంరాజు అప్పట్లో చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading