అనిల్ రావిపూడి దర్శకత్వం లో దగ్గుబాటి వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్, మరియు తమన్నా, మెహరిన్ హీరోయిన్ల కాంబినేషన్లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ f3. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. అయితే ఈ మూవీ మే 27వ తేదీన థియేటర్లోకి వచ్చి సక్సెస్ ఫుల్ టాక్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాను ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో 27.55 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం.
సినిమా ఇలా విజయవంతంగా దూసుకుపోతున్న సందర్భంలో సోమవారం రోజున సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ మీట్ లో నటీనటులు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో నటి ప్రగతి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు చేశానని, కానీ నాకు తగ్గట్టు పాత్రలు రాలేదనే వెలితి ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది అని చెప్పింది.
Advertisement
Advertisement
ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే చాలా రోజులు సినిమాలకు బ్రేక్ కూడా తీసుకున్నానని అన్నారు. కాఫీ మరియు టీ మోయడం దగ్గర నుండి పెద్ద పెద్ద విలన్ల పక్కన నటించడం, అలాగే అందమైన యంగ్ అమ్మ పాత్రలో నటించడం లాంటివి ఒక సెట్ ప్రాపర్టీ లాగానే పని చేశాను. కానీ అవేవీ కూడా తృప్తి ఇవ్వలేదని అన్నారు. కానీ నా జీవితంలో ఒక మంచి పాత్ర f2 రూపంలో బ్లెస్సింగ్ ఇచ్చిందని, దీని తర్వాత f3 అవకాశంతో పాటుగా నా పాత్రకు మంచి గుర్తింపు లభించిందని, ఈ సినిమా నాకు చాలా ఆనందాన్నిచ్చిందని నటి ప్రగతి ఎమోషనల్ అయ్యారు.
also read;
30 ఇయర్స్ పృథ్వీ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఆ సినిమాలో హీరోయిన్..!
భార్య, భర్తలు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ మూడు కారణాలే విడిపోవడానికి కారణమట !