Home » 30 ఇయ‌ర్స్ పృథ్వీ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఆ సినిమాలో హీరోయిన్..!

30 ఇయ‌ర్స్ పృథ్వీ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఆ సినిమాలో హీరోయిన్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో కామెడీ టైమింగ్ తో త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టుడు పృథ్వీ రాజ్. ఇంటి పేరు కంటే థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ గానే ఆయ‌న ఇండ‌స్ట్రీలో ఫేమ‌స్ అయ్యాడు. ఖడ్గం సినిమాలో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని డైలాగ్ చెప్పిన పృథ్వీ అదే పేరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

పృథ్వీరాజ్ లౌక్యం సినిమాలో చేసిన కామెడీ అంతా ఇంతాకాదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోల‌ను అనుక‌రిస్తూ ఈ సినిమాలో చేసే కామెడీ వేరే లెవ‌ల్. ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమాతో ఎంతో పాపులారిటీ వ‌చ్చింది.

 

అంతే కాంకుడా నిన్నుకోరి సినిమాలోనూ పృథ్వీ త‌న కామెడీతో నవ్వులు పూయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పృథ్వీరాజ్ కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ప్ర‌చారం చేసిన పృథ్వీ ప్ర‌స్తుతం అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా పృథ్వీకి ఓ కూతురు ఉంద‌ని ఆ కూతురు హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంద‌ని మాత్రం చాలా మందికి తెలియ‌దు. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు. త‌న కూతురు పేరు శ్రీలు అని ఆమె మ‌లేషియాలో హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసింద‌ని చెప్పాడు. త‌న‌కు న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో డ్యాన్స్ నేర్చుకుంద‌ని ఇప్పుడు హీరోయిన్ గా కూడా ప‌రిచ‌యం అవ్వ‌బోతుంద‌ని తెలిపాడు.

Advertisement

త‌న స్నేహితుడి కుమారుడు క్రాంతి ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడని త‌న కూతురు టాలెంట్ చూసి నిర్మాత‌లు డ‌బ్బులు పెట్టేందుకు వెన‌కాడ‌లేద‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతుంద‌ని తెలిపారు. శ్రీపీఆర్ క్రియేష‌న్స్ ద్వారా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని త్వ‌ర‌లోనే పూర్తివివ‌రాలను వెల్ల‌డిస్తామ‌ని పృథ్వీరాజ్ తెలిపారు. మ‌రి చూడ్డానికి అందంగా క‌నిపిస్తున్న పృథ్వీరాజ్ కూతురు ఇండ‌స్ట్రీలో ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

ALSO READ :

తెలుగు హీరోయిన్ అంజ‌లి సినిమాల ద్వారా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

 

Visitors Are Also Reading