సూర్యుడు,చంద్రుడు, భూమి వరుసలో ఉన్నప్పుడు గ్రహణాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం 2 చంద్ర గ్రహణాలు, 2 సూర్య గ్రహణాలు ఉంటాయి. మార్చి 25న ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది.ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడు ఛాయా గ్రహం రాహువు కన్యారాశిలో ఉంటాడు. అలాగే, అందరికీ ఇష్టమైన పండుగ హోలీ కూడా ఈ రోజునే వస్తుంది. కాబట్టి దీనిని చాలా ప్రత్యేకమైన కలయిక అని పండితులు పేర్కొంటున్నారు. చంద్రగ్రహణం ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:02 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం కారణంగా ప్రధానంగా 4 రాశుల వారి జీవితాల్లో పెను మార్పు వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.
Advertisement
మిథునం:
మీరు మాటల వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇంతకంటే మంచి సమయం లేదు.
Advertisement
సింహ రాశి :
మీరు చేసే పనిలో అందరి నుండి మీకు మద్దతు లభిస్తుంది. అలాగే, మీరు కొత్త ప్రణాళికలను తయారు చేసుకుంటారు. జీవితంలో ఐశ్వర్యం, ఆనందం రెట్టింపు అవుతాయి.
ధనస్సు రాశి :
ధనస్సురాశివారికి చంద్రగ్రహణం నుంచి మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.
మకర రాశి :
చంద్రగ్రహణంతో మకర రాశి వారికి కష్టాలు తీరుతాయి. ప్రధానంగా ఇప్పుడు ఓ రకమైన కంఫర్ట్ దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే కెరీర్‌లో పురోగతి ఉంటుంది.