ఈసారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సవాళ్లుని ఈసీ విజయవంతంగా ఎదుర్కొంది ఓటర్ల జాబితాలో తయారీ నుండి మొదలు పెడితే ఎన్నికల పోలింగ్ దాకా ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఈసీ చూపిన చొరవ ప్రభావం పోలింగ్ రోజు కనపడింది. రాష్ట్రంలో దాదాపు గత ఎన్నికల పోలింగ్లో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదవుతుందని అంచనాలు వెనుక ఈసీ బానే సక్సెస్ అయింది.
Advertisement
ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ఈసీ అనేక చర్యలు తీసుకోవాలి ఇందులో ఓటర్ల జాబితాలను నిష్పక్షపాతంగా తయారు చేయడం తో పాటుగా పోలింగ్ రోజు ఓటర్లతో సాఫీగా ఓటు వేయించేదాకా చాలా చర్యలు ఉంటాయి. అయితే ఈసీ అంతా పకడ్బందీగా వ్యవహరించిందనే దాన్ని బట్టి పోలింగ్ శాతాలు కూడా ఉంటాయి ఓటర్లలో ఈసీ నింపే చైతన్యం అన్నిటికంటే మించి వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తుంది ఈసారి ఇందులో ఈసీ సక్సెస్ అయింది పోలింగ్ లో కూడా ఓట్ల గల్లంతు ఆరోపణలు వినిపించలేదు.
Advertisement
Also read:
Also read:
ఏ ఒక్క పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందన్న ఫిర్యాదులు లేవు ఓటర్లను నిర్భయంగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేసేలా చూడడంలో ఈసీ విజయవంతం అయ్యింది. అదే సమయంలో ఎన్నికల సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో చెలరేగిన హింసను అరికట్టడంలో విఫలమైంది గతంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన గన్నవరం పెనమలూరు వంటి నియోజకవర్గం లో హింస చోటు చేసుకుంది. ఆకస్మిక బదిలీతో ఈసీ కాస్త చెడ్డ పేరు తెచ్చుకుంది. ఏది ఏమైనా బానే వ్యవహరించిందని చెప్పొచ్చు 80% పోలింగ్ నమోదయింది అంటే బాగానే సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!