దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానమైనవి అధి రక్తపోటు, మధుమేహం, రెస్పిరేటరీవ్యాదులు, ఆస్తమా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మందులు వాడుతూ నియంత్రణలో ఉంచుకోగలం. ఆస్తమా గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను నియంత్రించడం కాదు.. అదే పనిగాఇన్ హేలర్ తీసుకునే అవసరం కూడా ఉండదంటున్నారు. ఇటీవల కాలంలో ఆధునిక జీవన విధానంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఎలా వ్యాపిస్తుందో ఆస్తమా ముప్పు కూడా అలాగే పెరుగుతోంది.
Advertisement
ఆస్తమా అనేది చికిత్స లేని వ్యాధి. ఒకసారి సోకిందంటే జీవితాంతం మందులు లేదా ఇన్ హేలర్ వాడాల్సిందే. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందుకోసం డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఆస్తమా రోగులకు స్ట్రాబెర్రీ ప్రూట్స్ అద్భుత ప్రయోజనాలను కలిగిస్తాయి. విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఊపిరితిత్తులను సురక్షితంగా ఉంచుతుంది విటమిన్ సి.
Advertisement
ఆస్తమా సమస్యలను దూరం చేయడానికి డైట్ లో స్ట్రా బెర్రీ పండ్లను తప్పకుండా చేర్చుకోవాలి. ఆస్తమా వ్యాధి నియంత్రణలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పని చేస్తుంది బరువు కూడా తగ్గించుకోవచ్చు. స్ట్రాబెర్రీ పండ్లను ఉదయం బ్రేక్ పాస్ట్ లో తీసుకోవాలి. ఆస్తమా లక్షణాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక యాపిల్ తినాలి. యాపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఊపిరితిత్తుల స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తుంది. ఆస్తమాను నియంత్రిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పండ్లను తీసుకొని ఆస్తమాను తగ్గించుకోండి.
Also Read : శాకుంతలం సినిమా ఫస్ట్ రివ్యూ..సమంత మరో హిట్ కొట్టిందా..?