తలలో పేలు ఉన్నాయంటే.. ఆ బాధని భరించలేము. చాలా దురద కలుగుతూ ఉంటుంది. ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. పేలు తల లో నుండి వచ్చేవరకు కొంతమందికి నిద్రే పట్టదు. మీకు కూడా విపరీతంగా పేలు పట్టేసాయా..? ఆ సమస్య నుండి బయటపడలేకపోతున్నారా అయితే ఇలా చేయండి. ఇలా చేస్తే ఈజీగా పేలు సమస్య నుండి బయటపడొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇందుకు బాగా పనిచేస్తుంది అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని రెండు కప్పులు నీళ్లు పోసి, జుట్టుకు బాగా పట్టించాలి. పది నిమిషాల తర్వాత తలని బాగా దువ్వండి పేలన్ని బయటకి వచ్చేస్తాయి.
Advertisement
Advertisement
వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి కూడా బాగా పనిచేస్తుంది వెల్లుల్లి రెబ్బలని మెత్తగా నూరేసి కొంచెం నిమ్మరసం కలిపి తలకి పట్టించాలి. తర్వాత కొంచెం మసాజ్ చేయండి. అరగంట సేపు అలా ఉంచేసి తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసేయండి. జుట్టు ఆరిన తర్వాత బాగా దువ్వెయ్యండి. పేలు మొత్తం రాలిపోతాయి. తలకి వేపాకుల ముద్ద పట్టిస్తే కూడా పేలు అన్నీ కూడా మాయమైపోతాయి. ఆలివ్ ఆయిల్ ని తలకి బాగా పట్టించి కాసేపు వదిలేసి తర్వాత తల దువ్వండి మొత్తం పేలన్ని కూడా బయటకి వచ్చేస్తాయి ఇలా ఈజీగా ఈ సమస్య నుండి బయటకి వచ్చేయొచ్చు.
Also read:
- చాణక్య నీతి: కష్టాల్లో ఈ 4 విషయాలు.. అస్సలు మరిచిపోవద్దు..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ధనలాభం పొందుతారు
- లియో ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ నట విశ్వరూపం మామూలుగా లేదుగా..!