EAGLE MOVIE REVIEW IN TELUGU: మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. ఈగల్‌లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. హీరో నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్’ మూవీ ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ మరియు విశ్లేషణ :
జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో ప్రారంభం అవుతుంది కథ. అది చిన్న కథనం అయినప్పటికీ ఈగల్ నెట్ వర్క్ కి సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతో పాటు ఇతర దేశాలకు చెందిన వక్తులకు టార్గెట్ ఉంటుంది ఈగల్. సహదేవ వర్మ (రవితేజ) ఒక్కడే ఈగల్ నెట్ వర్క్ నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతో పాటు, పోలండ్ లోనూ ఆ నెట్ వర్క్ మూలాలు బహిర్గతమవుతాయి. ఈగల్ కి, తలకోన అడవులకు సంబంధం ఏంటి..? సహదేవ్ వర్మ ఎవరు..? అతని గతం ఏంటి..? ఈగల్ నెట్ వర్క్ లక్ష్యం ఏంటి..? సహదేవ్ వర్మ, రచన (కావ్యథాపర్) మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? అనే అంశాలు తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించాల్సిందే.
సహదేవ వర్మ పాత్రలో రవితేజ యాక్టింగ్, మేనరిజమ్స్ ఈగల్ మూవీలో కొత్తగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లలో రవితేజ శివతాండవం చేశాడు. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో అయితే రవితేజ ర్యాంప్ ఆడించాడు. ‘విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను’,’విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను’, ‘మార్గశిరం మధ్య రాత్రి మొండి మోతుబరి మారణ హోమం’, ‘తుపాకీ నుంచి బుల్లెట్ ఆగేది, అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు’, ‘ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు’ ఇలాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఫస్ట్ హాఫ్ కంటే సెకండాప్ చాలా అద్భుతంగా ఉంది. ఆసక్తికరమైన కథాంశంతో విలువైన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. బ్లేజింగ్ యాక్షన్ ఎపిసోడ్ లు ఎలివేషన్ లతో బాగా పని చేశాయి. బీజీఎం, విజువల్స్ చాలా అద్భుతమనే చెప్పాలి. గన్స్ మీదున్న నాలెడ్జ్‌కు డైరెక్టర్‌కు హ్యాట్సాప్.. ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంది.. చాప్టర్లు, చాప్టర్లుగా ఈ కథను చెప్పే విధానం బాగుంది. అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం, యాక్షన్ సీక్వెన్స్‌లో గన్నుతో సిగరెట్‌ను వెలిగించుకోవడం అదుర్స్ అనే చెప్పాలి. చివర్లో స్టైలీష్ బీజీఏం అదిరిపోయింది. ఇక చివరిలో యుద్ధకాండ పేరుతో పార్ట్ 2 చూపించడం విశేషం.
ప్లస్ పాయింట్స్ :
- రవితేజ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- బీజీఎం
మైనస్ పాయింట్స్ :
- ఫస్టాప్ లో కథనం కాస్త స్లోగా సాగడం
- కావ్య థాపర్ నిడివి తక్కువగా ఉండటం
రేటింగ్: 3 /5