Home » కొత్త కారు కొన్న దుల్కర్ సల్మాన్.. ఎన్ని కోట్లో తెలుసా..?

కొత్త కారు కొన్న దుల్కర్ సల్మాన్.. ఎన్ని కోట్లో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సౌత్ ఇండియా స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తండ్రి కొడుకులకు కార్లు కొనడం అంటే అమితమైన ఇష్టం. సాధారణంగా చాలామంది నటులు మార్కెట్లోకి ఎలాంటి కొత్త కార్ వచ్చిన ముందు వారే కొంటూ ఉంటారు. అలా దుల్కర్ సల్మాన్, ఆయన తండ్రి మమ్ముట్టి కి కూడా కార్లంటే అమితమైన మోజు. మార్కెట్లోకి ఎలాంటి ఖరీదైన కార్లు వచ్చిన వాళ్ళ ఇంటి ముందు ఉండాల్సిందే. ఇప్పటికే వారి వద్ద ఎంతో ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి 0369 గ్యారేజ్ పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నింటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ 0369 ఉంటుంది.

also read:అప్పుడు ఆశు రెడ్డి… ఇప్పుడు సురేఖ వాణి…వర్మ చేతిలో పడితే అంతే…!

Advertisement

తాజాగా ఈ గ్యారేజ్ కి సరికొత్త మెరిసిడోస్ మే బ్యాక్ Gls 600 కారు చేరింది. ఈ కారు కంపెనీ ఆల్ట్రా లగ్జరీ విభాగమైన మెరిసిడోస్ మే బ్యాక్ కిందకు వస్తుంది.0369 గ్యారేజ్ లోకి చేరిన GLS 600 మమ్ముట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెరిసిడోస్ మే బ్యాక్ GLS 600కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కార్లు కూడా మమ్ముట్టి 0369 నంబర్ తో రిజిస్టర్ చేయించుకున్నారు.

Advertisement

also read:శేఖర్ మాస్టర్ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

ఈ ప్రత్యేక నెంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ సరికొత్త కారు ధర సుమారు రూ.2.92కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ భారతదేశం నుంచి ఈ మెరిసిడోస్ మే బ్యాక్ జి ఎల్ ఎస్ 600 కారును ఉన్నటువంటి రెండవ సినీ నటుడిగా దుల్కాల్ సల్మాన్ ఉన్నారు. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్, 2022 లోనే ఈ కారును కొన్నారు. వీరితోపాటు అర్జున్ కపూర్,ఆయుష్మాన్ ఖురానా, కృతి సనను, శిల్పా శెట్టితో సహా మరి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా జి ఎల్ ఎస్ 600కొనుగోలు చేశారు.

also read:Dasara movie : ఓటీటీలో నాని ‘దసరా’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడో తెలుసా?

Visitors Are Also Reading