విక్టరీ వెంకటేష్ హీరోగా దృశ్యం సినిమా తెరకేక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనా, వెంకటేష్ కు భార్యగా నటించింది. సినిమాలో వెంకటేష్, మీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉంటారు. అయితే వారిలో చిన్న కూతురుగా మలయాళ చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో వెంకటేష్ ను పోలీసులు కొడుతుంటే ఏడుస్తూ నటించే సీన్ లో ఎస్తేర్ తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
Advertisement
ఇక ఇందులో వెంకీ పెద్ద కూతురుగా నటించిన హీరోయిన్ మరెవరో కాదు కృతిక జయకుమార్. బెంగళూరుకు చెందిన ఈమె, మొదటి నుంచి సినిమాలకు చాలా దూరంగా ఉంది. ఏడేళ్ల వయస్సులోనే భరతనాట్యం పెంచుకున్న కృతిక, ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్ పలు షోలలో పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే ఈమె తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ చూసి సినిమాల్లో ప్రయత్నించమని చెప్పారు.
Advertisement
అనంతరం తెలుగు దృశ్యం సినిమాకు ఆడిషన్ కు వెళ్ళగా, ఈమె అందులో ఎంపిక అయింది. తద్వారా సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది. 2014లో టాలీవుడ్లోకి దృశ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిక జయకుమార్, ఆ తర్వాతి ఏడాదిలోనే కన్నడలో ‘బాక్సర్’, తెలుగులో ‘వినవయ్యా రామయ్య’ చిత్రాలు నటించింది. ఇక అనంతరం ‘రోజులు మారాయి’, ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ లాంటి చిత్రాల్లో నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. 2021 లో మళ్ళీ దృశ్యం సీక్వెల్ తో ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.
READ ALSO : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్వేర్ జాబ్..రూ. 2,50,000 జీతం!