Home » ఏపీలోని.. ఈ ప్రదేశంలో తాగి దొరికితే.. అంతే..!

ఏపీలోని.. ఈ ప్రదేశంలో తాగి దొరికితే.. అంతే..!

by Sravya
Ad

తాగి డ్రై చేయడం  రిస్క్. తాగి డ్రైవ్ చేస్తే అమాయక ప్రజలు బలి అయిపోతూ ఉంటారు కూడా. తాగి అతివేగంతో వెళ్తూ నియంత్రణ లేక ఇతరులని యాక్సిడెంట్ చేయడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇటువంటి నేరాలని అరికట్టడానికి పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఒక్కొక్కసారి ప్రయోజనం లేకపోతోంది. తాగి డ్రైవ్ చేసిన వాళ్లకి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇది వరకు జరిగిన భయంకరమైన ప్రమాదాలని చూపించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే డ్రంకెన్ డ్రైవ్ లో ఎవరైనా దొరికిపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. పదే పదే అలానే చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ని సస్పెండ్ చేస్తారు ఒక వారం పాటు జైలుకు పంపిస్తూ ఉంటారు.

Advertisement

ఆ శిక్షలు కూడా చాలామందికి అలవాటైపోయాయి. ఆ శిక్షలు వల్ల ఫలితం ఉండట్లేదు. దీనితో కొత్త రకం శిక్షలు న్యాయమూర్తులు వేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నట్లు బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. ఇలా అయినా మార్పు వస్తుందని చూస్తున్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఈ మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు తీరానికి అనుకున్న బీచ్ రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. 60 మంది డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. ఇదివరకు కూడా వీళ్ళు పట్టుబడినట్లు తెలుస్తోంది. వీళ్ళకి కోర్టు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఫైన్ విధించింది. అంతేకాకుండా ఒక రోజు పాటు వీళ్లంతా సామాజిక సేవ చేయాలని చెప్పింది. భీమిలి ప్రభుత్వ డైట్ కళాశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తీయించడం శుభ్రం చేయడం వంటి పనులు చేయాలనీ ఆదేశించింది కోర్టు.

Also read:

Visitors Are Also Reading