Home » ఈ జ్యూస్ తాగితే మీ నరాలకు శక్తి రావడం పక్కా..!

ఈ జ్యూస్ తాగితే మీ నరాలకు శక్తి రావడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా బెటర్. వాటిలో పండ్లకు సంబంధించిన జ్యూస్ అయితే ఇంకా బెటర్. ముఖ్యంగా పండ్లలో దానిమ్మ పండు చాలా ఉత్తమం అనే చెప్పవచ్చు. ఇందులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అవి మంట, ఆర్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షిస్తాయి. నరాలకు బలాన్ని చేకూరుస్తాయి.  ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. 

Also Read : పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

Advertisement

Advertisement

దానిమ్మ ఐరన్ తో సహా చాలా పోషకాలతో కూడిన పండు. దానిమ్మ రసంలో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె  మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. నరాల బలహీనతను తొలగించుకోవడానికి దానిమ్మలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు మినరల్స్ తోడ్పడతాయి. ఇవి నరాలు, కండరాలకు సమర్థవంతంగా తోడ్పడతాయి. 

దానిమ్మ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. వీటిలో ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది. కండరాల పనితీరును చాలా మెరుగుపరుస్తుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. కనీసం రోజుకు ఒక్కసారైనా దానిమ్మ రసం తాగాలి. తాజా రసం తీసి త్రాగడం వల్ల చాలా మంచిది. ఇది కండరాలు, నరాలకు మాత్రమే కాకుండా.. ఆరోగ్యపరంగా  అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం దానిమ్మ జ్యూస్ తాగండి. 

Also Read :  అఖిల్ తరువాత మూవీకి బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా ?

Visitors Are Also Reading