టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గుండె పోటుతో కన్నుమూశారు. 2022 మహేశ్ బాబు ఫ్యామిలో తీవ్ర విశాదాన్ని నింపింది. ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తరవాత రీసెంట్ గా కృష్ణ మొదటి భార్య మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఇక ఇప్పుడు కృష్ణ కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండుకుంది.
Also Read: సూపర్ స్టార్ కృష్ణ అతి ఇష్టంగా తినే ఆహారం ఏంటో తెలుసా ?
Advertisement
హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగ్గా సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎన్నో సక్సెస్ లు చూశారు అయినప్పటికీ ఆయన జీవితంలోనూ కొన్ని తీరని కోరికలు ఉన్నాయట. సూపర్ స్టార్ కు చత్రపతి శివాజి కథ అంటే చాలా ఇష్టమట.
Advertisement
అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలోనే కృష్ణ ఛత్రపతి శివాజి సినిమా కథను కూడా రెడీ చేసుకున్నారట. కానీ ఆ స్క్రిప్ట్ లో మత ఘర్షణలకు దారి తీసే కొన్ని అంశాలు ఉండటంతో స్క్రిప్ట్ ను పక్కన పెట్టేశారట. అంతే కాకుండా తెలుగు తెరకు కృష్ణ జేమ్స్ బాండ్ అని చాలా మంది చెబుతుంటారు. కాగా మహేశ్ బాబు ను కూడా అలాంటి పాత్రలలో చూడాలని కృష్ణ కోరుకునేవారట.
Also Read: ఆ గుర్రం కృష్ణకు తప్ప వేరే హీరోకి ఇచ్చేవారు కాదట.. కారణం ఏంటంటే..?
కానీ చివరి వరకూ కృష్ణకు ఆ కోరిక తీరనేలేదు. కృష్ణ ఇప్పటికే తన ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మమేశ్ బాబుల సినిమాలలో నటించారు. కాగా మనవడు గౌతమ్ సినిమాలోనూ నటించాలని కోరుకున్నారట. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. వీటితో పాటూ కృష్ణకు అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి అంటే చాలా ఇష్టమట. అలాంటి షో చేయాలని అనుకునేవారట కానీ చివరికి ఆ కోరిక కూడా తీరలేదు.
Also Read: ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు ఎవరి ప్రస్థానం ఎలా సాగిందంటే..?