Home » ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు ఎవరి ప్రస్థానం ఎలా సాగిందంటే..?

ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు ఎవరి ప్రస్థానం ఎలా సాగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతుంది అంటే దానికి ప్రధాన కారణం ఈ నలుగురు హీరోలే అని చెప్పవచ్చు. వీరి హయాంలోనే ఇండస్ట్రీ అనేక సమస్యల నుంచి బయటకు వచ్చి కొత్త పుంతలు తొక్కింది. వీరు ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా తారాస్థాయిలో నిలిపారని చెప్పవచ్చు. అలాంటి ఈ నలుగురు ధృవతారాలు నింగికెగిశారు.. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏఎన్ఆర్,ఎన్టీఆర్, కృష్ణంరాజు,కృష్ణ.. ఇండస్ట్రీకి ఈ నలుగురు హీరోలు నాలుగు పిల్లర్ల లా ఉండి టాలీవుడ్ రేంజిని మూడు పువ్వులు ఆరు కాయలుగా డెవలప్ చేశారు. అలాంటి నలుగురి ప్రస్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SR.NTR:

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడుగా ఎదిగారు. 1923 మే 28 జన్మించిన ఆయన మన దేశం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను హీరోగా నిలబెట్టిన సినిమాలు చంద్రహారం,పాతాళభైరవి, మాయాబజార్ అని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ చివరి సినిమాలు మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ. ఈయన 1996 లో మృతి చెందారు.
అక్కినేని నాగేశ్వరరావు:సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని. 1924 సెప్టెంబర్ 20న ఈయన జన్మించారు. ఈయన మొదటిసారి తెరపై కనిపించిన మూవీ ధర్మపత్ని. స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం దేవదాస్.. అక్కినేని చివరి చిత్రం 2014లో వచ్చిన మనం. ఆయన 2014 జనవరి 22న మరణించారు.

Advertisement

Advertisement

also read:కృష్ణ మృతి చెందడానికి అసలు కారణం ఏంటో తెలుసా ?

కృష్ణంరాజు:

తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన ఆయన జన్మించారు. ఆయన తెరపై కనిపించిన మూవీ చిలకా గోరింక. ఈ చిత్రం 1966 లో వచ్చింది. మంచి హిట్ ఇచ్చిన మూవీ తాండ్ర పాపారాయుడు. ఇక రెబల్ స్టార్ చివరిసారి కనిపించిన మూవీ రెబల్, రాధే శ్యామ్.. ఈ స్టార్ నటుడు 2022 సెప్టెంబర్ 11న మృతి చెందారు.
కృష్ణ:

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించారు. ఈయన 1942 మే 31న జన్మించారు. ఈయన మొదటి సారి హీరోగా కనిపించిన మూవీ తేనెమనసులు.తెరపై మొదట కనిపించిన మూవీ కుల గోత్రాలు. కృష్ణకు స్టార్ హోదా కల్పించిన సినిమా గూడచారి 116. చివరిసారి కనిపించిన మూవీ శ్రీశ్రీ.. సూపర్ స్టార్ కృష్ణ 2022 నవంబర్ 15న మరణించారు.

also read:ఏ హీరోకి కూడా సాధ్యం కాని రికార్డు సూపర్ స్టార్ పేరిట ఉన్న విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading