Home » డ్రాగన్ ఫ్రూట్ తో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

డ్రాగన్ ఫ్రూట్ తో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి..!

by Sravya
Ad

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంది రెగ్యులర్ గా డ్రాగన్ ఫ్రూట్ ని తింటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది ఈ పండు వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ తో చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ అందానికి ఎలా ఉపయోగపడుతుంది..? ఎలా రెట్టింపు సౌందర్యాన్ని పొందవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు చేసుకుని ఒక స్పూన్ నిమ్మరసం అందులో వేసి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే రోజ్ వాటర్ కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసి 20 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టి, తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

Advertisement

Advertisement

హైడ్రేటింగ్ ఏజెంట్ లాగా డ్రాగన్ పనిచేస్తుంది ప్రతిరోజు ఈ పండుని తీసుకుంటే ముఖాన్ని తేమగా ఉంచుకోవడానికి అవుతుంది. చర్మ సమస్యలు కలగవు. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకోవడం వలన యవ్వనంగా కనపడడానికి అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకుంటే ముడతలు కూడా పడవు. వృద్ధాప్య ఛాయాలని నివారిస్తుంది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ లోని విటమిన్ సి చర్మ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. మొటిమలు, యాక్ని వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ గాయాలను కూడా తొందరగా మానేలా చేస్తుంది. చర్మం పొడిబారి పోకుండా చూస్తుంది.

Also read:

Visitors Are Also Reading