సాధారణంగా ఎవరైనా తమ పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. కొందరైతే.. పిల్లల కోసమే ప్రత్యేకంగా సినిమాకి వెళ్తుంటారు. కొంత మంది సినిమాలు విడుదలకు ముందు ప్రమోట్ చేస్తుంటారు. అయితే జయం రవి మాత్రం పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు అని ప్రమోట్ చేసుకున్నారు. తన తర్వాత మూవీ ఇరైవన్ గురించి ఈ కామెంట్లు చేశారు. జయం రవికి జోడిగా ఈ సినిమాలో నయనతార నటించడం గమనార్హం. తెలుగులో ఈ సినిమా గాడ్ పేరుతో థియేటర్లలో విడుదలవుతోంది.
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం గురించి జయం రవి మాట్లాడుతూ అన్ని వయస్సుల ప్రేక్షకులను అలరించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తానని తెలిపారు. కాకపోతే ఈ సినిమాను మాత్రం పిల్లలతో చూడవద్దని ఆయన కామెంట్ చేశారు. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ మూవీ అని సినిమాలోని కొన్ని సీన్లకు పిల్లలు భయపడే అవకాశం ఉందని జయం రవి చెప్పుకొచ్చారు. మా సినిమా ఏ విధంగా ఉందో ట్రైలర్ తో పరిచయం చేశామని ఈ తరహా చిత్రాలను కొంతమంది ఇష్టపడతారని జయం రవి అన్నారు.. వాళ్లు తప్పకుండా ఈ మూవీకి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నానని జయం రవి కామెంట్లు చేశారు.
Advertisement
Advertisement
ఆ తర్వాత జయం రవి లోకేష్ కనకరాజ్ గురించి మాట్లాడుతూ లోకేష్ కనకరాజ్ గతంలో నాకు ఒక కథ చెప్పారని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని లోకేష్ గొప్ప దర్శకుడు అని అన్నారు. లోకేష్ కనగరాజ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని జయం రవి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఇల్లు వదిలి వెళ్లిన జ్యోతిక.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన కార్తీ..!
బిగ్ బాస్ నుంచి థామిని ఎలిమినేట్ అవ్వడానికి 5 కారణాలు ఇవే..!