పూజ గది ఎంతో ప్రశాంతంగా ఉండేలా ప్రతి ఇంట్లోనూ చూసుకుంటారు. ఉదయాన్నే నిత్యకృత్యాలు అయ్యాక కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా గడపాలని అందరు కోరుకుంటారు. అలా దైవం కొలువై ఉండే ఆ ప్రదేశంలో అనవసరమైన వస్తువులను పెట్టడం వలన ఆ ప్రదేశం అంతా గందరగోళంలా తయారై ప్రశాంతతను పోగొట్టుకోవద్దు. ఇలా చేయడం వలన లేని పోనీ దోషాలు కూడా వస్తూ ఉంటాయి. దేవుని గదిలో ఏయే వస్తువులు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
Advertisement
ప్రతి ఇంట్లోనూ దేవుని గది ప్రత్యేకమైనది. ఆ గది నుంచి జెనెరేట్ అయ్యే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. అందుకే నెగటివ్ ఎనర్జీని ఇచ్చే వస్తువులను ఈ గదిలో పొరపాటున కూడా ఉంచకండి. అలా చేయడం వలన ఆ ప్రభావం ఇంటి సంపద, రాబడి పైన పడుతుంది. దాని వలన ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. అందుకే పూజ గది సర్దుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వస్తువులతో ఆ గదిని నింపేయకండి.
Advertisement
ఇంటికి ఈశాన్య దిక్కులో పూజ గది ఉండాలి. పూజ చేసేటప్పుడు మన ముఖం ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండేలా చూసుకోవాలి. దక్షిణం లేదా పడమట వైపు చూస్తూ పూజ చేయడం అస్సలు మంచిది కాదు. పూజలో వాడిన పదార్ధాలను, పూలను మరుసటి రోజు కచ్చితంగా తీసివేయాలి. దీనినే నిర్మాల్యం అని పిలుస్తారు. ఈ నిర్మాల్యాన్ని చాలా మంది ఓ కవర్ లో పెట్టి పూజ గదిలోనే పక్కగా ఉంచుతారు. అలా చేయకూడదు. వీటికి తీసుకెళ్లి ప్రవహించే నీటిలో వదిలివేయాలి. దీపపు కుందులను ప్రతి రోజు శుభ్రం చేయాలి. నైవేద్యం పెట్టాక, వాటిని అక్కడే వదిలేసి మర్చిపోకూడదు. వాటిని తప్పకుండా స్వీకరించాలి. పూజ పూర్తి అయ్యాక తిరిగి సామానులను యధాస్థానంలో సర్దుకోవాలి. విరిగిపోయిన విగ్రహాలను పూజ గదిలో ఉంచవద్దు. చినిగిన పూజ పుస్తకాలు ఉంటె, వాటిని కూడా ప్రవహించే నీటిలో వదిలివేయాలి. అక్షింతలుగా నూక బియ్యాన్ని వాడవద్దు. గతించిన పెద్ద వారి చిత్ర పటాలను కూడా పూజ మందిరంలో ఉంచకండి.
మరిన్ని..
“భోళా శంకర్” అట్టర్ ప్లాఫ్..భారీగా రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరంజీవి ?
Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్‌ను రిజెక్ట్ చేసిన చిరంజీవి..?
Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?