Home » Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఖాళీగా ఉంచకండి.. ఎందుకంటే?

Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఖాళీగా ఉంచకండి.. ఎందుకంటే?

by Srilakshmi Bharathi
Ad

ఇంట్లో సుఖ శాంతులు, సంతోషం కొలువై ఉండాలి అంటే కొన్ని వాస్తు సలహాలను పాటించడంలో తప్పేమి లేదు. శాస్త్రం లో ఏమి చెప్పబడినది, అందులో ఎంతో కొంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కొన్నిసార్లు సాయం సమయంలో చేయకూడని పనులు చేయడం వలన తీరని నష్టం కలుగుతుంది. దాని వలన ఇంటి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఈ ఐదు వస్తువులను ఖాళీగా ఉంచకూడదట. అవేంటో, ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రతి ఇంట్లో ఉండే బాత్ రూమ్ లలో కచ్చితంగా బకెట్ ఉంటుంది. అయితే.. ఈ బకెట్ లో ఎల్లప్పుడూ కొంత నీటిని పట్టి ఉంచాలట. ఖాళీ బకెట్ ని ఎప్పుడు ఉంచకూడదట. ఖాళీ బకెట్ స్థబ్దతని, ఇంట్లో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని సూచిస్తుంది. అందుకే, బకెట్ ని ఖాళీగా ఉంచకండి. కొంతమంది ఇంట్లో ఫ్లవర్ వాజ్ లు పెట్టి పూలు పెడతారు. కొన్నిరోజులు పెట్టి తిరిగి వదిలేస్తూ ఉంటారు. అలా చేయకుండా.. పూలను కచ్చితంగా అందులో ఉంచాలి. స్వచ్ఛమైన పూల సువాసన ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తుంది.

Advertisement

అలాగే చాలా మంది వాలెట్ లో డబ్బుల కంటే ఇతర పేపర్స్, ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఖాళీ పర్సుని ఎప్పుడు ఉంచకండి. అందులో ఎంతో కొంత డబ్బుని ఉంచండి. అలాగే నీటి పాత్రలు, బిందెలు వంటి వాటిని కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. కచ్చితంగా వాటిలో ఎంతో కొంత నీటిని పట్టి ఉంచండి. అలాగే పచ్చళ్ళు నిల్వ ఉంచే జాడీలను కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. వాటిలో ఏదైనా పచ్చడి లేదా, ఆహార పదార్ధాలను దాచి ఉంచండి. ఇది చాలా సాధారణమైన పని. కానీ ఇది కచ్చితంగా మీ సంపదని కాపాడుతుంది.

మరిన్ని..

రాజమౌళి జాతకంలో దురదృష్టం.. మహేష్ మూవీ పరిస్థితి ఏంటి..?

ఆ సమస్యలతో ప్రియమణి.. అందుకే పిల్లలు కూడా..!

ఈ రెండు సెటిమెంట్లు బన్నీ కి బాగా కలిసి వస్తున్నాయా..?

Visitors Are Also Reading