ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం లేదా రోజులో ఎక్కువ కేలరీలు తీసుకోవడం లాంటివి చెడు అలవాట్ల కిందికే వస్తాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల కాలక్రమమైన బరువు పెరుగుతారు. మధుమేహం, గుండె జబ్బుల లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడతారు. అయితే, రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
చాలామంది రాత్రిపూట కడుపునిండా తినేస్తూ ఉంటారు. దీని వలన జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది. దీనితో సమస్యలు వస్తాయి. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, చీజ్ బర్గర్స్ వంటి వాటిని రాత్రి పూట తీసుకోకండి. చాలామంది రాత్రిపూట ఆల్కహాల్ ని తీసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వలన నిద్ర సరిగ్గా పట్టదు సరి కదా గురక, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
Advertisement
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రాత్రి పూట పదేపదే లేవాల్సి వస్తుంది. దీనితో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇది మీ ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపిస్తుంది. రాత్రిపూట పుచ్చకాయ, కీరదోస వంటి వాటిని తీసుకోవద్దు. సిట్రస్ జ్యూస్, పచ్చి ఉల్లిపాయ, టమాటా సాస్ వంటి వాటిని తీసుకుంటే హాట్ బర్న్ తో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి రాత్రిపూట అస్సలు వేయటం తీసుకోవద్దు. రాత్రిపూట మసాలా, కారంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. దీని వలన నిద్ర సరిగ్గా పట్టకపోవడం, గుండెల్లో మంట కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఇవి కూడా చదవండి : ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త.. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు