Home » రుద్రాక్ష‌ను ధ‌రించిన‌వాళ్లు త‌ప్ప‌కుండా పాటించాల్సిన నియ‌మాలు ఇవే…!

రుద్రాక్ష‌ను ధ‌రించిన‌వాళ్లు త‌ప్ప‌కుండా పాటించాల్సిన నియ‌మాలు ఇవే…!

by AJAY
Published: Last Updated on
Ad

చాలా మంది రుద్రాక్ష‌లు వేసుకుంటారు. కానీ రుద్రాక్ష వేసుకుంటే ఏం జ‌రుగుతుంది…రుద్రాక్ష ఎలా వ‌చ్చింది అన్న‌ది మాత్రం చాలా మందికి తెలియ‌దు. అస‌లు రుద్రాక్ష ఎలా వ‌చ్చింది. రుద్రాక్ష‌ను ధ‌రించేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఎంటి అన్న‌ది ఇప్పుడు చూద్దాం… రుద్రుడు అంటే శిశుడు…మూడు పుర‌ముల‌తో పోరాడిన‌ప్పుడు మ‌ర‌ణించిన రాక్ష‌సుల‌ను చూసి విచారించాడు. అలా విచారించిన స‌మ‌యంలో ఆయ‌న కంటి నుండి జారిప‌డిన క‌న్నీళ్లు భూమిపై ప‌డి చెట్లుగా మారాయి. వాటి నుండి పుట్టిన‌వే రుద్రాక్ష‌లు.

rudhraksha

rudhraksha

రుద్రాక్ష అంటే రుద్రుడి క‌ళ్లు క‌న్నీళ్లు అని అర్థం వ‌స్తుంది. ఆత్మ‌సాక్షాత్మాకారం పొంద‌డానికి రుద్రాక్ష‌లే అస‌లైన మార్గం..ఇవే భూమికి స్వ‌ర్గానికి వార‌ది అని పురాణాల్లో ఉంది. రుద్రాక్ష‌లు ఎంతో ప‌విత్ర‌మైనవి శ‌క్తివంత‌మైనవి కూడా…రుద్రాక్షలు ద‌రించ‌డం వ‌ల్ల అనుకున్న ప‌నులు నెర‌వేర‌తాయని పండితులు చెబుతున్నారు. మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతున్నవారు..అనారోగ్య సమ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే వారి స‌మ‌స్య‌లు తొల‌గుతాయ‌ని చెబుతున్నారు. చెడు వ్య‌స‌నాల‌కు భానిస‌లైన‌వారు కూడా రుద్రాక్ష‌ల‌కు ధ‌రిస్తే ఆ అల‌వాట్ల నుండి భ‌య‌ట‌ప‌డ‌తార‌ని చెబుతున్నారు.

Advertisement

Advertisement

ALSO READ : CHANAKYANITHI: ఇలా చేస్తే ఇత‌రుల‌ను వ‌శ‌ప‌రుచుకోవ‌చ్చు..!

ఇక రుద్రాక్ష‌లో 21 ర‌కాలు ఉన్నాయి. ఇక రుద్రాక్ష‌మాల‌ను ధ‌రించిన వారు కొన్ని నియమాల‌ను ఖ‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మాల‌ను ధ‌రించిన‌వాళ్లు మైల ప‌డిన వారిని తాక కూడదు. రుద్రాక్ష ధ‌రించిన వారు స్మ‌శానంకు వెళ్ల‌కూడ‌దు. రుద్రాక్ష‌ను ఉంగ‌రంలో ధ‌రిచంకూడ‌దు. స్త్రీలు రుతుశ్రావం స‌మయంలో రుద్రాక్ష‌ను ధ‌రించ‌కూడ‌దు. అంతే కాకుండా రుద్రాక్ష‌ను ధ‌రించి పాల్గొన‌కూడ‌దు. ఇవ రుద్రాక్ష‌ల్లో ఎంతో ప‌విత్ర‌మైన‌ది ఏక ముఖి రుద్రాక్ష అని పంచాంగ నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading