పిచ్చుకపై బ్రహ్మస్త్రం మాదిరిగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది రష్యా. సైనిక పరంగా, ఆర్థిక పరంగా ఎలా చూసినా.. రష్యా ముందు చాలా చిన్నది ఉక్రెయిన్. దీంతో రష్యా సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని అనుకుంటోంది. దీనిపై అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ, కెనడా, ఇతర యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా పట్టించుకోవడం లేదు రష్యా. తన లక్ష్యాన్ని సాధించే వరకు యుద్ధం వీడే ప్రసక్తి లేదని చెబుతోంది.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్ తరువాత నెక్ట్ టార్గెట్ తైవాన్ అన్నారు. ఉక్రెయిన్ ను రష్యాను ఆక్రమించుకోవడం పూర్తి అయిన తరువాత తుదుపరి దాడి తైవాన్ పైనే జరుగుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకోసం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాడు. అమెరికా నేతలను ప్రపంచ దేశాలు అసమర్థులుగా చూస్తున్నారని.. దీంతో వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
Also Read : మహిళల ప్రపంచ కప్లో అన్ని మ్యాచ్లకు డీఆర్ఎస్ విధానం