మనలో చాలా మందికి ఆహారం తిన్న తరువాత స్వీట్లు తినాలనిపిస్తుంది. ఎక్కువగా స్వీట్లు తింటే డయాబెటిస్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. హోటళ్లలో రెస్టారెంట్లలో భోజనం చేసిన తరువాత సోంపు అందిస్తారనే సంగతి తెలిసిందే. ఇక సోంపు మాత్రమే ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. సోంపులో శరీరానికి అవసరం అయిన యాంటి ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం, జింక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉంటాయి.
Advertisement
చాలా మంది కంటి చూపు మందగించడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. సోంపు, నవోతు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యంతో పాటు దృష్టి కూడా మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి. క్రమం తప్పకుండా ఎవరు అయితే ఈ మిశ్రమాన్ని తీసుకుంటారో వాళ్లకు కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. భోజనం చేసిన తరువాత సోంపు తీసుకుంటే మంచిది అని చెప్పవచ్చు. మనలో చాలా మంది నోటి దురవాసన వల్ల బాధపడుతుంటారు.
Advertisement
ఇది కూడా చదవండి : Lemon Peels : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా..? నిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..!
సోంపు, నవోతు వల్ల నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరుగకుండా చేయడంలో సోంపు సహాయపడుతుంది. సాధారణంగా చల్లని వాతావరణం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశముంటుంది. సోంపుతో పాటు నవోతు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. నవోతులో శరీరానికి ఉపయోగపడే ఔషదగుణాలుంటాయి. ఇక సోంపు,నవోతు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యకి చెక్ పెడతాయి. ఈ రెండు కలిపి తీసుకుంటే చర్మం పేలవంగా మారడం, తల తిరగడం, నీరసం సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సోంపు సహాయపడుతుంది. సోంపు తిన్న తరువాత నవోతు తింటే మంచిది.
ఇది కూడా చదవండి : 30 ఏళ్లు దాటిన మహిళలు ఈ ఐదు రకాల పరీక్షలు తప్పక చేయించుకోండి