చిన్న వయసులో వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనలని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది బాల మెరుపు. చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు రంగు మారిపోతు ఉంటుంది. దీనితో చిన్న వయసు నుంచే రంగులు వేసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. దీనితో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఒక్క వెంట్రుక తెల్లబడినా సరే రంగు వేయడం అలవాటు చేసుకున్నారు.
Advertisement
Advertisement
ఇక చిన్న వయసులోనే ఎందుకు వెంట్రుకలు రంగు మారిపోతాయి ఏంటీ అనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. చిన్న వయసులోనే మీసాలు, గడ్డాలు కొందరికి తెల్ల పోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. జీన్స్ పరంగా వచ్చే కారణాల వల్ల మీసాలు, గడ్డాలు, అలాగే తెల్ల పడిపోయే అవకాశాలు ఉంటాయి. వారసత్వంగా సమస్య ఎక్కువగా ఉండటం చాలా మందిని ఆందోళనకు గురి చేసే అంశం.
అదే విధంగా తర్వాతది హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా కావచ్చని వైద్యులు చెప్తున్నారు. ఇక ఆహారం విషయంలో కూడా ఏది పడితే అది తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు తినే ఆహారం కూడా దాదాపుగా ఎక్కడ చూసినా సరే కల్తీ గానే ఉంది అనే మాట వాస్తవం. మనం తినేది అంతా ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి చిన్నవయసులోనే మీసాలు, గడ్డాలు కొందరికి తెల్లబడిపోతున్నాయి. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.