ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ జబర్దస్త్ షోకు జడ్జిలు, యాంకర్స్, టీమ్ లీడర్లు ఇలా పలువురు వస్తూ పోతూ ఉన్నారు. ఎంతమంది వచ్చిపోయినా గాని జబర్దస్త్ మాత్రం క్రేజీ అలాగే ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ ప్రేమ జంట అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు రష్మి గౌతమ్-సుధీర్. వీరిద్దరి తర్వాత జబర్దస్త్ లో ఎక్కువగా సందడి చేస్తున్న జంట వర్ష-ఇమ్మానుయేల్. ఇక వీరు చేస్తున్న సందడి మామూలుగా లేదు. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా ఉందని ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు. కానీ వీరు మంచి స్నేహితుల మాత్రమే అంటూ వారి సన్నిహితులకు చెబుతున్నారు.
Advertisement
ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య స్నేహము చెడిపోయిందని, కేవలం కార్యక్రమాల కోసమే వారు కలిసి ఉన్నారని.. కలిసి అప్పుడప్పుడు స్టేజిపై సందడి చేస్తున్నారని బుల్లితెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.త్వరలోనే వీరిద్దరూ వేర్వేరుగా పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఇమ్మానుయేల్ హర్ష రోజువారి పారితోషకం కొంచెం ఎక్కువ అంటూ ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇమ్మానియేల్ రెమినరేషన్తో పోలిస్తే వర్ష రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంటుందని స్వయంగా వర్ష సన్నిహితుల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులు వీరిద్దరిని అభిమానిస్తున్నారు. దీంతో భవిష్యత్ లో కూడా వీరిద్దరు మరిన్ని కార్యక్రమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.
Advertisement
Also Read : నువ్వు మాములోడివి కాదు బాబీ అన్నా… ఈ పంచ్ డైలాగ్ అక్కడ నుంచి లేపేసావా ?
ఇక పారితోషకం విషయంలో వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో.. ఇప్పుడు కాకుండా ముందు ముందు అయినా వీరి జోడి ఇచ్చిండా మాయే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమం ముందు ముందు మరిన్ని జరగాల్సిన అవసరం ఉందంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి జోడి కి సంబంధించి మంచి మార్కులే పడుతున్నాయి. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వీరిద్దరూ గొడవ పడితే కచ్చితంగా మంచి అవకాశం మిస్ అవుతుందంటున్నారు. కాబట్టి వీరికి సమానమైన పారితోషకం ఇవ్వడం బెటర్ అని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రవితేజని కిందకి లాగే ప్రయత్నం.. ఎందుకంటే..?