Telugu News » Blog » నువ్వు మాములోడివి కాదు బాబీ అన్నా… ఈ పంచ్ డైలాగ్ అక్కడ నుంచి లేపేసావా ?

నువ్వు మాములోడివి కాదు బాబీ అన్నా… ఈ పంచ్ డైలాగ్ అక్కడ నుంచి లేపేసావా ?

by AJAY
Ads

ఒక‌ప్పుడు సినిమా విడుద‌ల‌య్యింది అంటే ఆ సినిమాను ఎంట‌ర్టైన్ మెంట్ కోసం మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు సినిమా విడుద‌ల‌య్యిందంటే ఆ సినిమాలోని ఇన్ఫ‌ర్మేష‌న్ ను కూడా వెతుకుతున్నారు. అంతే కాకుండా ప్రేక్ష‌కులు సినిమాలోని లాజిక్ ల‌ను కూడా ప‌ట్టించుకుంటున్నారు. సంగీత ద‌ర్శ‌కులు ఇత‌ర సినిమాల నుండి మ్యూజిక్ ను లేపేసినా…ద‌ర్శ‌కులు వేరే సినిమా నుండి డైలాగులు సీన్ లు లేపేసినా ఇట్టే పసిగ‌డుతున్నారు.

Advertisement

అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాల్తేరు వీర‌య్య సినిమా విష‌యంలోనూ అలానే జ‌రుగుతోంది. చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా వాల్తేరు వీర‌య్య‌. ఈ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాను మైత్రీ మూవీమేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు.

Advertisement

ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాను మాఫియా…యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ర‌వితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ సీన్ ను వేరే సినిమా నుండి కాపీ కొట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

waltair-verayya

ట్రైల‌ర్ లో చిరు రికార్డుల్లో నా పేరు ఉండ‌టం కాదు…..నా పేరు మీద‌నే రికార్డ్స్ ఉంటాయి అంటూ డైలాగ్ కొట్టాడు. అయితే ఇదే డైలాగును క‌మెడియ‌న్ పృధ్వీ విన్న‌ర్ సినిమాలో కామెడీగా చెప్పాడు. రికార్డుల్లో నా పేరు ఉండ‌టం ఏంట్రా…నా పేరు మీద‌నే రికార్డులు ఉంటాయ్…సుజాత సింగం సుజాత అంటూ డైలాగ్ చెప్పాడు. దాంతో బాబీ అన్నా ఈ పంచ్ డైలాగ్ ను అక్క‌డ లేపావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ : రవితేజని కిందకి లాగే ప్రయత్నం.. ఎందుకంటే..?

Advertisement

https://fb.watch/hWrdvSHMDM/