భారతదేశంలో పలు రకాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తీరికలేని, ఉరుకుల పరుగుల జీవితమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది బయటి తిండికి అలవాటు పడి ఊబకాయంతో బాధపడుతున్నారు. వ్యాయామం చేసే తీరిక కూడా లేకపోవడంతో ఇతర అనారోగ్యాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆహారంలో చేసుకునే కొద్దిపాటి మార్పులతో ఆరోగ్యంగా ఉండవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో బ్రౌన్ రైస్ వాడకాన్ని పెంచాలని సిఫారసు చేస్తున్నారు.
Advertisement
బ్రైన్‌రైస్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయి. వీటి ద్వారా శరీరానికి అవసరం అయ్యే పోషకాలందుతాయి. అందుకే బ్రౌన్ రైస్‌ను కేవలం బరువు తగ్గించే ఏజెంట్‌గా మాత్రమే పరిగణించకూడదు. విస్తృత ప్రయోజనాలతో లబ్ధిపొందేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటిని వైట్ రైస్ మాదిరిగా ప్రాసెస్ చేయరు. బ్రౌన్ రూస్‌లో బ్రాన్, జెర్మ్ ఉంటాయి. పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. వైట్‌రైస్ వాడకాన్ని తగ్గించి బ్రౌన్‌రైస్ వినియోగాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
Advertisement
ఇక ముడి బియ్యాన్ని శరీరంలోని ప్రమాదకరమైన ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి ఉంటుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. దీని వల్ల గుండె సమస్యలు ఎదురు అవుతాయి. బ్రౌన్ రైస్ ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించగలదు. ముడి బియ్యంలో ఉండే సహజ నూనెకు ఈ శక్తి ఉంటుంది. బ్రౌన్ రైస్ గట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. ముడి బియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లోని కదలికను మెరుగు పరుచుతుంది. అదేవిధంగా పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read :