Home » ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ పాపను గుర్తుపట్టారా…?

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ పాపను గుర్తుపట్టారా…?

by AJAY
Ad

సాధారణంగా సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమందిని అభిమానులు ఈజీగా గుర్తు పడతారు కానీ కొంతమంది నటీనటులను చిన్నప్పటి లుక్ లో మాత్రం అస్సలు గుర్తు పట్టలేరు. వాళ్ళు చిన్నప్పుడు ఉన్నదానికంటే చాలా మారిపోతారు. కానీ సరిగ్గా చూస్తే మాత్రం ఫోటోలో ఉన్న హీరో లేదా హీరోయిన్ ను గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఫోటో కూడా ఓ స్టార్ హీరోయిన్ ఫోటోనే.

Advertisement

చిన్నప్పుడు స్కూల్లో లో గుడ్ గర్ల్ లా కూర్చున్న ఆ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆవిడే రెజీనా…. సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం తరువాత రెజీనా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన పిల్ల నువ్వులేని జీవితం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ తేజ్ కు జోడిగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో నటించింది.

Advertisement

అంతే కాకుండా రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాలోనూ రెజీనా హీరోయిన్ గా నటించింది. ఇండస్ట్రీలో రాణించాలంటే గోరంత అదృష్టంతో పాటు కొండంత కష్టం కూడా ఉండాలన్న సంగతి తెలిసిందే. అయితే అదృష్టం లేదో ఏమో గానీ స్టార్ హీరోల సినిమాల్లో రెజీనా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక రెజీనా తాజాగా మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సాంగ్ లో ఈ మేరకు అలరిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading