Telugu News » Blog » “దానవీరశూరకర్ణ” మూవీ ఇంతటి రికార్డు సాధించిందా.!!

“దానవీరశూరకర్ణ” మూవీ ఇంతటి రికార్డు సాధించిందా.!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీ లోనే తన అద్భుతమైన నటన తో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరి పోయే కళాశక్తి ఆయన సొంతం.. ఆయన పౌరాణిక సినిమాలు చేసాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది.. రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్..
ALSO READ:ప్ర‌తి రోజూ ఈ దివ్యౌష‌దం తాగితే ఫుల్‌ బెనిఫిట్స్

 

ఇప్పటివరకు ఆయనకు సాటిగా నటించిన నటుడు అయితే లేరని చెప్పవచ్చు.. అలాంటి పౌరాణిక చిత్రాల్లో దాన వీర శూర కర్ణ చాలా స్పెషల్.. 1977 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఎన్టీఆర్ వహించారు.. ఇందులో దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడిగా విభిన్న పాత్రల్లో నటించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, హరికృష్ణ కూడా ఇందులో నటించారు.. కానీ ఈ సినిమా అప్పట్లో రికార్డు స్థాయిలో వసూలు చేసి సినిమా ఇండస్ట్రీ లోనే అత్యుత్తమ చిత్రంగా పేరు పొందింది.

Advertisement

అప్పట్లో ఈ సినిమాకు 20 లక్షల బడ్జెట్ పెడితే దానికి 15 రేట్లు ఎక్కువగా లాభాలు తీసుకువచ్చి మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. నాలుగు గంటలకు పైగా నిడివితో 25 థియేటర్స్ లో తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో పెద్ద రికార్డు సృష్టించింది. సినిమా ఇంత సమయం ఉన్నా కానీ ప్రేక్షకులకు ఎక్కడ కూడా విసుగు లేకుండా ఎన్టీఆర్ తన నటనా ప్రతిభతో అందరినీ మెస్మరైజ్ చేశారని చెప్పవచ్చు. ఈ సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది.

ALSO READ:SR.Ntr గారి సినిమా నుంచి మధ్యలోనే ఎందుకు చిరుని తీసేసారు !

You may also like